వన్డేలకు జయంత్, అక్సర్ పటేల్ లకు నో ఛాన్స్.. Jayant Yadav and Axar Patel could miss England series

Jayant yadav and axar patel could miss england series

cricket, default, india_vs_england, india_cricket_team, england_cricket_team, jayant_yadav, axar_patel, rohit_sharma, ajinkya_rahane, ravichandran ashwin, ashwin, rahane, jayant yadav, rohit sharma, axar patel, india, england, odi

Jayant Yadav and Axar Patel are likely to miss out on the ODI series against England after succumbing to hamstring and finger injuries respectively.

వన్డేలకు జయంత్, అక్సర్ పటేల్ లకు నో ఛాన్స్..

Posted: 12/27/2016 06:23 PM IST
Jayant yadav and axar patel could miss england series

ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఆరంగ్రేటం చేసి.. అటు బ్యాట్ తోనూ ఇటు బాల్ తోనూ తన ప్రతిభను చాటుకున్న టీమిండియా యువ బ్యాట్స్ జయంత్ యాదవ్ కు వచ్చే నెలలో పర్యాటక జట్టుతో జరగనున్న పరిమిత ఓవర్లలో స్థానం లభించే అవకాశాలు మృగ్యంకానున్నాయి. ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ సందర్భంగా అద్భుత ప్రదర్శనను ఇచ్చిన జయంత్ యాదవ్.. మోకాలి గాయం కారణంగా చెన్నై టెస్టుకు దూరమయ్యాడు. అతను ఇంకా మోకాలి గాయం నుంచి తిరిగి కోలుకోలేకపోవడంతో వన్డే సిరీస్లో పాల్గొనే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.

ఇక మరో యువ అటగాడు అక్సర్ పటేల్ కూడా టీ20లకు, వన్డేలకు దూరం కానున్నాడు. అతడు కూడా గాయం భారిన పడి మ్యాచ్ లకు దూరం కానున్నాడు. ఇప్పటికే పలువురు టీమిండియా ఆటగాళ్లు గాయాలు బారిన పడిన సంగతి తెలిసిందే. టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, అజింక్యా రహానే, మొహ్మద్ షమీలు గాయాలు బారిన పడటం.. ఇటీవల జట్టులో చేరిన యువ క్రీడాకారులు కూడా గాయాలతో మ్యాచ్ లకు దూరం కావడంతో.. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లకు ఎవర్ని ఎంపిక చేయాలన్న దానిపై టీమిండియా సెలక్టర్లు కసరత్తు చేస్తున్నారు.

జనవరి 15 నుంచి భారత-ఇంగ్లండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది. అనంతరం జనవరి 26వ తేదీన మూడు ట్వంటీ 20 సిరీస్ జరుగుతుంది. అయితే దీనికి ముందు బోర్డు ఎలెవన్ జట్టు రెండు ప్రాక్టీస్ మ్యాచ్లను ఇంగ్లండ్ తో ఆడుతుంది. ఆ ప్రాక్టీస్ మ్యాచ్ల్లో పరిమిత ఓవర్ల కెప్టెన్ ధోని పాల్గొననున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs england  jayanth yadav  limited overs  odi  t20  chennai test  

Other Articles