ప్రపంచ టెస్టు క్రికెట్ లో అశ్విన్ అరుదైన ఘనత Ashwin completes rare Test double

R ashwin completes rare test double as india bully england

Ravichandran Ashwin, India vs England Tests, Ian Botham, Richie Benaud, George Giffen, Aubrey Faulkner, sports, sports news, cricket news, cricket

Ravichandran Ashwin today became the first Indian and only the fifth all-rounder in the world to take more than 25 wickets and score in excess of 300 runs in a Test series.

ప్రపంచ టెస్టు క్రికెట్ లో అశ్విన్ అరుదైన ఘనత

Posted: 12/20/2016 03:39 PM IST
R ashwin completes rare test double as india bully england

భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ తాను స్పిన్ మాంత్రికుడన్న విషయాన్ని తన రికార్డులతో చెరిపేకుని బెస్ట్ అల్ రౌండర్ అన్న విధంగా జట్టలో దూసుకుపోతున్నాడు. ఈ మేరకు ాయన ఇంగ్లాండ్ సిరీస్ లో సాధించిన పరుగులు, వికెట్లను సాధించిన గణంకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన ఏకంగా ప్రపంచ టెస్టు క్రికెట్ లో ఐదవ బెస్ట్ అల్ రౌండర్ గా తన పేరున రికార్డును లిఖించుకున్నాడు. ఇప్పటికే నాలుగు పర్యాయాలు మ్యాన్ అప్ ది సిరీస్ అవార్డులను కైవసం చేసుకున్న అశ్విన్ రికార్డుల పంట పండించుకుంటున్నాడు.

తాజాగా గత 30 ఏళ్లుగా ఎవరూ అందుకోలేని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో 25 వికెట్లను పడగొట్టడమే కాకుండా... 300 లకు పైగా పరుగులు చేశాడు. మూడు దశాబ్దాల తర్వాత ఓ ఆటగాడు ఈ రికార్డును అందుకోవడం ఇదే ప్రథమం. 1985లో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ ఇయాన్ బోథమ్ ఈ ఘనతను సాధించాడు. ఆ సంవత్సరం జరిగిన యాషెస్ సిరీస్ లో 250 పరుగులు చేయడమే కాక, 31 వికెట్లను బోథమ్ పడగొట్టాడు. ఆ తర్వాత మరెవరూ ఈ రికార్డును అందుకోలేకపోయారు.

ఈ సిరీస్ లో అశ్విన్ ఇప్పటి వరకు 28 వికెట్లు తీయడమే కాక, 306 పరుగులు సాధించాడు. ఇక ఈ రికార్డులతో పాటు ఒక సంవత్సరంలో ఆరు వందల పరుగులు సాధించడంతో పాటు 60 టెస్టు వికెట్లు తీసుకున్న నాలుగో అల్ రౌండర్ గా కూడా నిలిచాడు. దీంతో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సరసన చేరాడు. 1979లో కపిల్ దేవ్ 619  పరుగులు చేయడంతో పాటు 74 వికెట్లను తీసుకున్నాడు. ఆ తరువాత దీనిని ఇయాన్ బోథమ్, ఫ్లింటాఫ్ లు కూడా సాధించగా, ఈ ఏడు రవిచంద్రన్ అశ్విన్ కూడా 612 పరుగులతో పాటు 72 వికెట్లను తీసుకుని ముగ్గురు దిగ్గజాల సరసన చేరాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravichandran Ashwin  India vs England Tests  Ian Botham  cricket  

Other Articles