ట్రిపుల్ టన్ బాదిన నాయర్.. రికార్డులు బద్దలు Karun Nair Becomes Second Indian to Slam Triple Ton

Karun nair becomes second indian to slam triple ton

India vs england, karun nair, Team India, England, triple century, chennai test, fifth test, chidambaram stadium, cricket

Team India batsman Karun Nair became only the second Indian to slam a triple hundred in Test cricket as he remained unbeaten on 303 against England in the fifth and final Test.

ట్రిపుల్ టన్ బాదిన నాయర్.. రికార్డులు బద్దలు

Posted: 12/19/2016 06:20 PM IST
Karun nair becomes second indian to slam triple ton

భారత యువతరం క్రికెటర్ కరుణ్ నాయర్ సరికొత్త రికార్డు సృష్టించాడు. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న చివరి, ఐదవ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో కరుణ్ నాయర్ అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలో కెరీర్ లో తొలి సెంచరీ నమోదు చేసిన నాయర్ డబుల్ సెంచరీతో పాటు ట్రిపుల్ సెంచరీ కూడా సాధించి సత్తాచాటాడు. తొలి శతకాన్ని ట్రిపుల్ శతకంగా మార్చిన రెండో క్రికెటర్ గా కూడా తన పేరును నమోదు చేసుకన్నాడు నాయర్.

ఒక మ్యాచ్ లో పిఫ్త్ డౌన్ (ఐదవ స్థానం) లేదా ఆ తరువాత డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోరును సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్ లో నాయర్ 225 పరుగుల వ్యక్తిగత పరుగులను దాటిన క్రమంలో ధోని రికార్డును బ్రేక్ చేశాడు. 2013లో ఆస్ట్రేలియాపై ధోని 224 పరుగులను సాధించాడు. ఇదే ఇప్పటివరకూ ఐదు అంతకంటే తక్కువ స్థానాల్లో వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రికార్డుగా ఉంది. దీన్ని నాయర్ తాజాగా సవరించాడు.

మరొకవైపు తొలి సెంచరీని డబుల్ సెంచరీగా మార్చిన మూడో భారత ఆటగాడిగా నాయర్ నిలిచాడు. గతంలో దిలీప్ సర్దేశాయ్(200 నాటౌట్;న్యూజిలాండ్ పై1965లో), వినోద్ కాంబ్లి(224; ఇంగ్లండ్ పై 1993లో) ఈ ఘనత సాధించారు. ఇంగ్లండ్ తో ఐదో టెస్టు  ద్వారా మొదటి సెంచరీని నాయర్ సాధించగా, దాన్ని డబుల్ గా మార్చుకున్నాడు. రోహిత్ శర్మ గాయంతో ఇంగ్లండ్ తో మూడో టెస్టులో నాయర్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. గత మ్యాచ్ ల్లో ఘోరంగా విఫలమైన నాయర్.. ఈ మ్యాచ్ లో పరుగుల దాహంతో చెలరేగిపోయాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles