నాయర్ ప్రతిభపై ద్రావిడ్ కు బిసిసిఐ ప్రశంసలు Rahul Dravid, 'A' wall behind India's bench strength

Anurag thakur credits rahul dravid for karun nair s historic feat

Team India, India vs England, Anurag Thakur, karun nair, rahul dravid, BCCI, sports, sports news, cricket news, cricket

Andhra pradesh pcc president raghuveera reddy announces the results of praja ballot in ths state, says it is the priority of people of the state.

నాయర్ ప్రతిభపై ద్రావిడ్ కు బిసిసిఐ ప్రశంసలు

Posted: 12/20/2016 03:45 PM IST
Anurag thakur credits rahul dravid for karun nair s historic feat

టీమిండియా జాతీయ జట్టులోకి అరంగ్రేటం చేసిన రెండో మ్యాచ్ లో భారత మిడిల్ అర్డర్ బ్యాట్స్ మెన్ కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ సాధించడాన్ని కొనియాడుతూనే.. అందుకు అన్ని విధాలుగా వారిని నిష్టాతులుగా తీర్చిదిద్దినందుకు గానూ దిగ్గజ ఆటగాడు, అండర్-19 కోచ్ రాహుల్ ద్రవిడ్పై బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్.. ప్రశంసల వర్షం కురిపించాడు. కరుణ్ నాయర్ ట్రిపుల్ చేయడం వెనుక రాహుల్ ద్రవిడ్ కృషి ఎంతో ఉందని కొనియాడాడు.

యువ క్రికెటర్లకు అమూల్యమైన టెక్నిక్స్ను నేర్పుతూ వారు రాణించడానికి ద్రవిడ్ పరోక్షంగా కారణం అవుతున్నాడన్నాడు. భారత జట్టు  అసాధారణ ప్రదర్శనను అభినందిస్తున్నన్నారు. మూడో ఇన్నింగ్స్ లోనే కరుణ్ నాయర్ ఆకట్టుకోవడం అతనిలో సత్తాకు నిదర్శనమన్నారు. 25 ఏళ్లకే ట్రిపుల్ను సాధించడమంటే అది నిజంగానే గొప్ప ఘనతని కోనియాడారు. అతనికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

అయితే టీమిండియాలో ప్రధానంగా అండర్19, భారత్-ఎ సైడ్లు ప్లాట్ఫాం పటిష్టంగా ఉండటం కారణంగానే భారత జాతీయ జట్టు బలంగా కనబడుతుందని, అంతేకాకుండా బలోపేతం అవుతుందని కూడా ఆయన అశాభావం వ్యక్తం చేస్తూ ఆ క్రెడిట్ ను రాహుల్ ద్రావిడ్ కూడా దక్కుతుందన్నారు. రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో కుర్రాళ్లు రాటుదేలుతున్నారు. అతని ఇచ్చే సూచనలు, అనుభవం యువ క్రికెటర్లకు వరంలా మారుతుందని అనురాగ్ ఠాకూర్ ప్రశంసించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Team India  India vs England  Anurag Thakur  karun nair  rahul dravid  BCCI  

Other Articles