ఉత్కంఠకర పోరులో పాక్ ను చిత్తు.. hosts win gabba test with 39 runs

Australia vs pakistan 1st test hosts win by 39 runs

Australia, Australia vs Pakistan, Brisbane, Cricket, Gabba, Pakistan, Pakistan in Australia 2016, Pakistan vs Australia, Test cricket

Asad Shafiq scored a thrilling century as Pakistan put up a spirited resistance to Australia on Sunday, frustrating the hosts' attempts to wrap up the first Test with a day to spare.

ఉత్కంఠకర పోరులో పాక్ ను చిత్తు..

Posted: 12/19/2016 02:42 PM IST
Australia vs pakistan 1st test hosts win by 39 runs

అస్ట్రేలియాలోని గబ్బా స్టేడియం వేదికగా పర్యాటక జట్టు పాకిస్తాన్ తో జరిగిన తొలి టెస్టులో ఉత్కంఠకర పోరులో ఆతిథ్య జట్టు ఎట్టకేలకు విజయాన్ని అందుకుంది. అది నుంచి మ్యాచ్ పై పట్టుబిగించిన అథిథ్యజట్టు..  మరో రోజు అట మిగిలివుండగానే గెలుపును కైవసం చేసుకుంది. రసవత్తరంగా సాగిన డే అండ్ నైట్ టెస్టులో ఆస్ట్రేలియా కేవలం 39 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. ఆసీస్ విసిరిన 490 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్ పోరాడి ఓడింది. తొలి ఇన్నింగ్స్ లో పెద్దగా ప్రభావాన్ని చాటకుండా వరుసగా వెనుదిరిగిన పాకిస్థాన్ జట్టు.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం అద్భుత ప్రతిభను కనబర్చింది.

ఇవాళ జరిగిన ఆటలో 450 పరుగుల వద్ద పాక్ ఆలౌట్ కావడంతో అసీస్ ను విజయం వరించింది. పాక్ ఆటగాడు ఆసద్ షఫిక్ శతకంతో రాణించాడు. 207 బంతులను ఎదుర్కొన్న అతడు.. ఒక సిక్స్, పదమూడు ఫోర్ల సాయంతో 137 పరుగులతో చివరి వరకూ పోరాడినా జట్టును మాత్రం ఓటమి తీరాల నుంచి గట్టెక్కించలేకపోయాడు. పాక్ స్కోరు 449 పరుగుల వద్ద షఫిక్ తొమ్మిదో వికెట్ గా అవుట్ కావడంతో మరో పరుగు మాత్రమే చేసి పాక్ తన రెండో ఇన్నింగ్స్ ను ముగించింది.

అంతకుముందు 382/8 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన పాక్ మరో 68 పరుగులు జోడించి రెండు వికెట్లను నష్టపోయింది. ఈ రోజు ఆటలో షఫిక్ దాదాపు 21.0 ఓవర్ల పాటు క్రీజ్ లో ఉన్నా మ్యాచ్ ను రక్షించలేకపోయాడు. స్టార్క్ వేసిన ఓవర్ లో వార్నర్ క్యాచ్ కు అవుటయ్యాడు. దాంతో పాక్ ఓటమి ఖాయమైంది. స్టార్క్ వేసిన అదే ఓవర్ లో యాసిర్ షా అనవసర పరుగు కోసం యత్నించి రనౌట్ కావడంతో పాక్ పరాజయం చెందింది. పాక్ చివరి వికెట్ పడిన అనంతరం ఆసీస్ ఆనందం  అవధులు దాటింది. స్వదేశంలో జరిగిన మ్యాచ్ లో ఆసీస్ కడవరకూ పోరాడి గెలవడంతో ఆ జట్టు ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. ఈ మ్యాచ్ లో విజయంతో ఆసీస్ సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles