బిసిసిఐకి డబ్బులివ్వాలని బ్యాంకులకు సుప్రీం అదేశం SC releases Rs. 1.33 crore for Mumbai, chennai Tests

Supreme court allows bcci to incur rs 1 33 crore expenses for india england tests

supreme court bcci, bcci supreme court, supreme court bcci cricket, cricket bcci supreme court, Lodha panel, Lodha committee, india vs england, england vs india, ind vs eng, cricket

BCCI will also furnish details of expenditure and income from the upcoming two Test matches scheduled at Mumbai and Chennai, the bench said.

బిసిసిఐకి డబ్బులివ్వాలని బ్యాంకులకు సుప్రీం అదేశం

Posted: 12/07/2016 06:24 PM IST
Supreme court allows bcci to incur rs 1 33 crore expenses for india england tests

జస్టిస్ లోథా కమిటీ సిఫార్సుల అమలు చేయడానికి నిరాకరించడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై మండిపడ్డ దేశసర్వోన్నత న్యాయస్థానం బోర్డు సంబంధించిన బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బులు డ్రా చేసేందుకు వీలు లేదని, కేవలం తమ అదేశాల మేరకు మాత్రమే నిధులను విడుదల చేయాలని అదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రారంభమైన ఇంగ్లాండ్ సిరీస్ నేపథ్యంలో తొలుత కొన్న నిధులను విడుదల చేసిన మూడు టెస్టులకు వినియోగించుకోవాలని అదేశించింది.

ఈ నెల 8 నుంచి ప్రారంభం కానున్న ముంబై టెస్టు నేపథ్యంలో నిర్వహణ ఖర్చుల కోసం నిధులు కవాలని బిసిసిఐ మరోమారు సుప్రీంకోర్టు ను అశ్రయించింది. ఈ నేపథ్యంలో డబ్బులు లేకుండా మ్యాచ్ ల నిర్వహణ అసాధ్యమని బీసీసీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో ఇంగ్లాండ్ తో ఇకపై జరగాల్సిన రెండు టెస్టు మ్యాచ్ ల నిర్వహణకు 1.33 కోట్ల రూపాయలు విడుదల చేయాలని సుప్రీంకోర్టు బ్యాంకులను ఆదేశించింది.

ఇక ఇంగ్లాండ్ తో జరగనున్న 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్ లకు ఒక్కో మ్యాచ్ నిర్వహణకు 25 లక్షల రూపాయలు చొప్పున నిధులు విడుదల చేయాలని బ్యాంకులను ఆదేశించింది. నిధులను విడుదల చేసిన సర్వోన్నత న్యాయస్థానం మరో మెలిక కూడా పెట్టింది. టెస్టు మ్యాచ్ ల సందర్భంగా ఖర్చుల వివరాలను కూడా రాయాలని, దానిని మ్యాచ్ లు ముగిసన అనంతరం కోర్టుకు సమర్పించాలని బిసిసిఐని అదేశించింది. దీంతో ఇంగ్లండ్ సిరీస్ నిర్వహణకు నిధుల ఇబ్బందులు లేకుండా చూసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : supreme court  bcci  Lodha panel  india vs england  banks  funds  cricket  

Other Articles