రిషబ్ పంత్ రికార్డు.. రంజీలో ఫాస్టెట్ సెంచరీ Rishabh Pant slams fastest century in history

Rishabh pant slams fastest century in history of india s first class cricket

Rishabh Pant, Ranji Trophy, Fastest Century, First-class cricket, Cricket record, cricket, cricket news, sports, sports news

Emerging Delhi batsman Rishabh Pant added yet another feather to his cap as he slammed the fastest century in the history of India's first-class cricket.

రిషబ్ పంత్ రికార్డు.. రంజీలో ఫాస్టెట్ సెంచరీ

Posted: 11/08/2016 07:01 PM IST
Rishabh pant slams fastest century in history of india s first class cricket

భారత దేశవాళీ క్రికెట్ లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ గా పేరొందిన రంజీ సీజన్లో ఢిల్లీ ఆటగాడు రిషబ్ పంత్ అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. గ్రూప్ -బిలో భాగంగా జార్ఖండ్తో జరిగిన మ్యాచ్లో రిషబ్ పంత్  ఏకంగా తన పేరును రికార్డును నమోదు చేసకున్నాడు. ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా అత్యంత వేగంగా శతకాన్ని బాది.. చరిత్ర సృష్టించాడు. రెండో ఇన్నింగ్స్ లో తన ఢిల్లీ జట్టు తరపున 48 బంతుల్లో శతకం సాధించి రంజీ చరిత్రలో ఫాస్టెస్టు సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో ఓవరాల్గా 135 పరుగులు చేసిన రిషబ్.. 8 ఫోర్లు, 13 సిక్సర్లతో చెలరేగి ఆడాడు.
 
తన మెరుపు శతకంతో రాజేశ్ బారోహ్, వీబీ చంద్రశేఖర్ లు సంయుక్తంగా 56 బంతుల్లో నమోదు చేసిన ఫాస్టెస్ట్ రికార్డు చెరిపేసి తన పేరున రికార్డును లిఖించుకున్నాడు. అంతేకాదు.. దేశవాళీ క్రికెట్ లో ఒక మ్యాచ్లో అత్యధికంగా సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడిగా రిషబ్ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ ఎనిమిది సిక్సర్లు కొట్టిన రిషబ్.. రెండో ఇన్నింగ్స్లో 13 సిక్సర్లను కొట్టాడు. అయితే ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఘనత న్యూజిలాండ్ ఆటగాడు కోలిన్ మున్రో పేరిట ఉంది. 2015లో మున్రో ఒక మ్యాచ్ లో 23 సిక్సర్లు సాధించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rishabh Pant  Ranji Trophy  Fastest Century  First-class cricket  Cricket  

Other Articles