భారత్ సిరీస్ తరువాత కెప్టెన్సీకి గుడ్ బై.. Cook giving up captaincy after India series

Alastair cook hints at giving up england captaincy after india series

alastair cook, england, captaincy, india vs england, virat kohli, kohli, joe root, cook england, cook captaincy, cook, kevin pietersen, india vs england, ind vs eng, england vs india, cricket, cricket news, sports, sports news

Alastair Cook will surpass Michael Atherton's England record of 54 matches as Test skipper after the first match in India.

ఇండియా సిరీస్ తరువాత కెప్టెన్సీకి గుడ్ బై..

Posted: 11/08/2016 06:26 PM IST
Alastair cook hints at giving up england captaincy after india series

భారత్తో జరిగే ఐదు టెస్టుల సిరీస్ ముగిసిన అనంతరం ఆతిధ్య జట్టు కెప్టెన్ అలెస్టర్ కుక్ తన నాయకత్వ పగ్గాలను వదులుకోబోతున్నారా..? అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. ఇంగ్లండ్ టెస్టు జట్టుకు అత్యధిక మ్యాచ్లకు సారథిగా వ్యవహరించిన ఘనతను సొంతం చేసుకోబోతున్న ఆయన ఎందుకిలాంటి నిర్ణయం తీసుకోబోతున్నట్లు సంకేతాలను ఇచ్చారు.? అసలు అయనిచ్చిన సంకేతాలేంటి..? అంటే తన కెప్టెన్సీపై ఆయన చేసిన వ్యాఖ్యలే.  

భారత్తో సిరీస్ తరువాత తాను కేవలం ఓపెనర్గానే జట్టులో కొనసాగుతాననే సంకేతాలను ఇచ్చాడు. తాను టెస్టు కెరీర్ను యాథావిధిగా కొనసాగించాలనుకుంటున్నానని, అదే సమయంలో ఓపెనర్గా తన ఆటను కొనసాగిస్తానని చెప్పాడు. అయితే ఇక్కడ తన కెప్టెన్సీకి సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలను కుక్ చేయలేదు. దాంతో భారత్ తో సిరీస్ అతనికి కెప్టెన్ గా చివరి సిరీస్ కావొచ్చని భావిస్తున్నారు.

2012లో ఇంగ్లండ్ జట్టుకు కుక్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. అదే ఏడాది భారత్ తో జరిగిన టెస్టు సిరీస్ ను ఇంగ్లండ్ 2-1 తో గెలుచుకుంది. ఇప్పటివరకూ కుక్ నేతృత్వంలోని ఇంగ్లండ్ 24 టెస్టులను గెలిచింది. అదే క్రమంలో రెండు  యాషెస్ సిరీస్లను కూడా ఇంగ్లండ్ జట్టు కుక్ సారథ్యంలో సొంతం చేసుకుంది. 2006లో భారత్ తో జరిగిన మ్యాచ్ తో అంతర్జాతీయ టెస్టు కెరీర్ను ఆరంభించిన కుక్.. అరంగేట్రం మ్యాచ్లోనే సెంచరీ సాధించాడు. ఇప్పటివరకూ 135 టెస్టులు ఆడిన కుక్.. 10, 688 పరుగులను సాధించి ఈ ఫార్మాట్లో ఇంగ్లండ్ తరపున అత్యధిక పరుగులు నమోదు చేసిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : alastair cook  england  captaincy  india vs england  cricket  

Other Articles