రామ్ స్లామ్ లో పొలార్డ్ పొల్గొనడంపై సందిగ్ధం WICB leave Pollard stumped with 20% tax

Kieron pollard denied noc by wicb to play in south africa s t20 bash

Pollard, Ramdin dropped from ODI squad, Kieron Pollard, Zimbabwe Tri-Nation Series, WICB, west indies, south africa, West Indies cricket, cricket, cricket news, sports, sports news

Kieron Pollard, the West Indies allrounder, has been denied a No-Objection Certificate to compete in South Africa's domestic T20 league

రామ్ స్లామ్ లో పొలార్డ్ పొల్గొనడంపై సందిగ్ధం

Posted: 11/08/2016 07:05 PM IST
Kieron pollard denied noc by wicb to play in south africa s t20 bash

ప్రపంచ చాంఫియన్లుగా నిలిచిన జట్టు ప్రస్తుతం అటగాళ్ల మధ్య సమన్వయ లోపంతో ఇరకాటంలో పడి ఇబ్బందులను ఎదుర్కోంటుంది. అది ఏ దేశమో అర్థమైంది కదూ.. వెస్టిండీస్. ప్రపంచ కప్ గెలిచీ గెలవగానే మీడియా సమావేశంలో బోర్డుపై కెప్టెన్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం పరిస్థితికి అద్దం పడుతుంది. ప్రధానంగా జీతభత్యాల విషయంలో ఆటగాళ్లు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇదే అంశంపై గత కొంత కాలంగా క్రికెటర్లకు, బోర్డుకు మధ్య విభేదాలు కూడా తారాస్థాయికి చేరుకున్నాయి.

దీంతో తమ నిర్ణయమే ఫైనల్ అని విండీస్ క్రికెట్ బోర్డు స్పష్టం చేస్తూ తీసుకున్న చర్యలలో ప్రధానమైన జట్టు సభ్యులను కూడా పక్కన పెడుతుంది. తాజాగా విదేశీ లీగ్ లు అడేందుకు సుముఖత వ్యక్తం చేసే క్రికెటర్లకు కూడా ఒక మెలిక పెట్టింది. వారికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్ఓసీ) కావాలంటే..వారు విదేశాలలో అడే మ్యాచ్ ఫీజులలో 20 శాతం బోర్డుకు చెల్లించాలని స్పష్టం చేసింది. అందుకు అంగీకరించని వారికి మాత్రమే తాము నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇస్తామని స్పష్టం చేసింది.

ఇదే విషయాన్ని దక్షిణాఫ్రికా ట్వంటీ 20 లీగ్ రామ్ స్లామ్లో ఆడటానికి రెండేళ్ల పాటు ఒప్పందం చేసుకున్న పొలార్డ్కు ఈ-మెయిల్ ద్వారా స్పష్టం చేసింది. వెస్టిండీస్ జాతీయ జట్టులో ఉన్న ఆటగాళ్లు ఎవరైనా విదేశీ లీగ్లో ఆడటానికి వెళ్లే ముందు 20 శాతం ఫీజును చెల్లించడానికి అంగీకరించి ఎన్ఓసీ తీసుకోవాలని పేర్కొంది. దాంతో త్వరలో దక్షిణాఫ్రికాలో జరిగే ఆ లీగ్లో పొలార్డ్ పాల్గొనే అవకాశాలు కనిపించడం లేదు. ఆ నిబంధనకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు అంగీకరించకపోవడంతో రామ్ స్లామ్ లో పొలార్డ్ పొల్గొనడం సందిగ్ధంలో పడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kieron Pollard  WICB  west indies  south africa  Cricket  

Other Articles