బంగ్లాదేశ్ అశలపై నీళ్లు చల్లిన బెన్ స్ట్రోక్స్.. Stokes breaks Bangladesh hearts

Bangladesh v s england ben stokes spoils the party for tigers visitors win by 22 runs

Cricket, Bangladesh v/s England, Ben Stokes, Alastair Cook, Taijul Islam, Sabbir Rahman, Shafiul Islam, Mushfiquir Rahim, Jonny Bairstow, Gareth Batty

Paceman Ben Stokes picked up the last two wickets in three balls to give England a thrilling 22-run victory over Bangladesh in the first test at Chittagong

గెలుపు ముందిట బోర్లా పడిన బంగ్లాదేశ్

Posted: 10/24/2016 07:39 PM IST
Bangladesh v s england ben stokes spoils the party for tigers visitors win by 22 runs

ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ను విజయం ఊరించినట్లే ఊరించి చివరకు నిరాశను మిగిల్చింది.  ఆఖరి రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి బంగ్లాకు షాకిచ్చాడు. దాంతో ఇంగ్లండ్ విసిరిన 286 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 22 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 253/8 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ చివరి రెండు వికెట్లను పది పరుగుల వ్యవధిలో కోల్పోయి పరాజయం చెందింది. ఈ రోజు ఆటలో బంగ్లాకు 33 పరుగులు అవసరమైన క్రమంలో బెన్ స్టోక్స్ ఒక్క బంతి వ్యవధిలో రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్కు విజయాన్ని అందించాడు.

బంగ్లా స్కోరు 263 పరుగుల వద్ద ఓవర్ నైట్ ఆటగాడు తైజుల్ ఇస్లామ్(16) తొమ్మిదో వికెట్ గా అవుట్ కాగా, అదే స్కోరు వద్ద షాఫుల్ ఇస్లామ్ డకౌట్ వెనుదిరిగాడు. దాంతో మరో ఓవర్ నైట్ ఆటగాడు షబ్బిర్ రెహ్మాన్(64 నాటౌట్) అవతలి ఎండ్లో ప్రేక్షక పాత్ర పోషించాల్సి వచ్చింది.  అటు బ్యాటింగ్లోనూ, ఇటు బౌలింగ్లోనూ రాణించిన స్టోక్స్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 293 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 240 ఆలౌట్

బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 248 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 263 ఆలౌట్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : england  bangladesh  first test  ben strokes  banladesh vs england  cricket  

Other Articles