రైనాను వెంటాడిన వైరల్ ఫీవర్.. ఆ రెండు వన్డేలకు.. Suresh Raina Ruled Out of India vs New Zealand ODIs

India vs new zealand suresh raina ruled out for remaining two odis

india vs new zealand, ind vs nz, ind vs nz odi, ind vs nz odi squad, ms dhoni, suresh raina, raina, odi matches, viral fever, india vs new zealand ranchi, india cricket, cricket news, cricket

Suresh Raina, who missed the first three matches due to viral fever has been ruled out of the remainder of the series.

రైనాను వెంటాడిన వైరల్ ఫీవర్.. ఆ రెండు వన్డేలకు..

Posted: 10/24/2016 08:32 PM IST
India vs new zealand suresh raina ruled out for remaining two odis

టీమిండియా జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న భారత్ బ్యాట్స్ మెన్ సురేష్ రైనాకు అదృష్టం కలసివచ్చినా.. దురదృష్టం అంతకన్నా ముందుగానే వచ్చి పలుకరించిందా.? అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. కాసింత పేలవమైన అటతీరుతో టీమిండియా తుది జట్టులో స్థానం కోల్పోయిన సురేష్ రైనాను వైరల్ ఫీవర్ వెంటాడింది.. తన సత్తాకు పరీక్ష రూపంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతో రైనా విఫలం కావడమే ఇందుకు కారణంగా మారుతుంది.

న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ కు ఎంపికైన రైనా సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. అయితే అనూహ్యంగా వైరల్ ఫీవర్ బారినపడ్డ రైనా తొలి మూడు వన్డేలకు దూరమయ్యాడు. రెండు వన్డేల్లో భారత జట్టు విజయం సాధించడంతో జట్టులో మార్పులు చేసి, కూర్పును చెడగొట్టకూడదని బీసీసీఐ భావిస్తోంది. దీంతో మిగిలిన రెండు వన్డేలకు టీమిండియాలో ఎలాంటి మార్పులు చోటుచేసుకునే అవకాశం లేదు. దీంతో రైనా జ్వరం నుంచి కోలుకున్నా ఎలాంటి ఉపయోగం ఉండే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే జట్టు కూర్పుపై సంతోషంగా ఉన్నట్టు ధోనీ పేర్కొన్నాడు. తరువాతి వన్డే ధోనీకి ఎంతో అచ్చొచ్చిన వైజాగ్ లో జరుగనుండడంతో ఆ వన్డే విజయంపై అంతా ధీమాగా ఉన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs new zealand  suresh raina  odi matches  viral fever  cricket  

Other Articles