Sensational Sharjeel takes Pakistan to 337-6 against Ireland

Sharjeel s barnstorming 152 sets up record pakistan win

Pakistan, Ireland, first odi, Sharjeel Khan, century, pakistan batsman, cricket, Ahmed Sarfraz, Andy Mcbrine, Azam Babar, Azhar Ali, Ed Joyce, Gary Wilson, Imad Wasim, Kevin O Brien, Malik Shoaib, Mohammad Amir, Mohammad Hafeez, Mohammad Nawaz, Niall O Brien, Paul Stirling, Sharjeel Khan, Stuart Poynter, Tim Murtagh, Umar Gul, William Porterfield

Sharjeel Khan’s brilliant 152 propelled Pakistan to an emphatic 255-run win over Ireland in the first KPC Group one-day international at Malahide

పసికూన ఐర్లాండ్ పై పాక్ రికార్డు విజయం

Posted: 08/18/2016 08:51 PM IST
Sharjeel s barnstorming 152 sets up record pakistan win

పసికూనలపై చెలరేగి అడటంలో ఘనత వహించిన పాకిస్థాన్ మళ్లీ అదే పనిచేసింది. ఐర్లాండ్ తో జరుగుతున్న మొదటి వన్డేలో పాకిస్థాన్ ఓపెనర్ షార్జిల్ ఖాన్ రెచ్చిపోయాడు. సెంచరీలో చెలరేగాడు. వన్డేల్లో పాకిస్థాన్ తరపున రెండో వేగవంతమైన శతకం నమోదు చేశాడు. 61 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ సాధించాడు. షాహిద్ ఆఫ్రిది తర్వాత అత్యంత వేగవంతమైన సెంచరీ కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన షార్జిత్ ఐర్లాండ్ బౌలర్లపై సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు.

21 ఓవర్ లో వరుసగా 6, 4, 6, 6 బాదాడు. మరో ఎండో వికెట్లు పడుతున్నా వీరవిహారం కొనసాగించాడు. 86 బంతుల్లో 16 ఫోర్లు, 9 సిక్సర్లతో 152 పరుగులు చేసి అవుటయ్యాడు. షార్జిత్ విజృంభణతో పాకిస్తాన్ 255 పరుగుల భారీ పరుగులతో ఐర్లాండ్ పై విజయం సాధించింది. ఈ విజయానికి ఓపెనర్ షార్జిల్ ఖాన్ సాధించిన 152 పరుగులే కీలకంగా మారాయి. పాకిస్తాన్ ఆరు వికెట్ల నష్టానికి 337 పరుగులను నిర్ణీత 50 ఓవర్లలో సాధించింది, కాగా ఆ తరువాత బ్యాటింగ్ కు దిగన ఐర్లాండ్ కేవలం 82 పరుగులకే అలౌట్ కావడంతో పాకిస్తాన్ రికార్డు విజయాన్ని నమోదు చేసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan  Ireland  first odi  Sharjeel Khan  century  pakistan batsman  cricket  

Other Articles