I won't change my natural game, says Rohit Sharma

I won t change my natural game says rohit sharma

india vs west indies, ind vs wi, wi vs ind,india vs west indies, ind vs wi, wi vs ind, west indies, rohit sharma, rohit sharma batting, r ashwin, rahane, rohit sharma, kl rahul, saha, west indies bowling, sports news, sports, cricket news, cricket

After falling cheaply in the first innings, Rohit Sharma made his second opportunity count in the third Test against the West Indies.

ఏ అర్డర్ లోనైనా సహజశైలి బ్యాటింగ్ కే ప్రాధాన్యమిస్తా

Posted: 08/16/2016 09:36 PM IST
I won t change my natural game says rohit sharma

బ్యాటింగ్ చేసేప్పుడు తన సహజశైలిలో ఆడేందుకే అధిక ప్రాధాన్యతను ఇస్తానని.. అయితే పరిస్థితులను బట్టి కోచ్, కెప్టెన్లు ఇచ్చే అదేశాల ప్రకారం అడపాదడపా తన అటతీరును మార్చుతానని టీమిండియా ఢాషింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ చెప్పాడు, వారి అదేశాల నేపథ్యంలోనూ తాను అడుతున్నది టెస్టులా లేక వన్డేలా అన్నది కూడా పరిగణలోకి తీసుకుంటానని చెప్పాడు, దీంతో పాటు తాను మిడిల్, లోయర్ ఆర్డర్లో ఆడాలని కెప్టెన్, కోచ్ నిర్ణయిస్తే దానిని అమలు చేసేందుకు తాను ఎప్పుడూ సిగ్గుపడనని అన్నాడు.

మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో తక్కువ స్కోరు(9)కే అవుటైన రోహిత్, రెండో ఇన్నింగ్స్ లో మాత్రం చెలరేగిపోయి కేవలం 59 బంతుల్లోనే 3 సిక్సర్లు, 1 ఫోర్ బాది 41 పరుగులు చేసి భారత్ ఆధిక్యంతో పాటు రన్ రేట్ ను చాలా త్వరగా పెంచేశాడు. వాస్తవానికి బౌలర్లపై ఎదురుదాడికి దిగి వారి లయను దెబ్బతీస్తూ వారిని ఒత్తిడిలోకి నెట్టడం తనకు ఇష్టమన్నాడు. అయితే ఇందుకోసం తాను ఆడతున్న ఓవర్లో తొలి బంతినా లేక చివరి బంతా.. అనే దాంతో సంబంధం లేకుండా షాట్లు ఆడతానన్నాడు.

తాను ఎలా బ్యాటింగ్ చేయాలో.. ఎలా చేయకూడదో తనకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. వన్డేల్లో ఆడిన తరహాలో టెస్టుల్లో ఆడటం కుదరదని చెప్పాడు. జట్టు అవసరాలకు తగ్గట్టుగా ఆడటాన్ని తాను అలవర్చుకోవడంతో ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలో కోచ్, కెప్టెన్ చెబితే తాను సులువుగా అందుకు తగ్గట్టుగా ఆట తీరును మార్చుకుంటానని రోహిత్ శర్మ వెల్లడించాడు. గతేడాది లంకతో సిరీస్ లో ఇదే పాటించానని గుర్తుచేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs west indies  ind vs wi  wi vs ind  rohit sharma  cricket  

Other Articles