Test Day 2: India declares 1st innings at 566/8 against West Indies after Kohli’s double ton, Ashwin ton

India vs west indies india declares 1st innings at 566 8

india vs west indies, west indies vs india, ind vs wi, wi vs ind, india tour of west indies, india cricket, west indies cricket, virat kohli, Jason Holder, Test series, anil kumble india, kumble cricket, kumble bowling, cricket, sports news, sports

Team India declared first test first innings at 566/8 against west indies, Indian Test skipper Virat Kohli scored his first ever double hundred with Ravichandran ashwin ton.

566 పరుగుల వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్ డిక్లేర్..

Posted: 07/23/2016 05:03 PM IST
India vs west indies india declares 1st innings at 566 8

వెస్టిండీస్ పర్యటనలో నాలుగు టెస్టు సీరీస్ లలో భాగంగా అంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా పస్ట్ ఇన్నింగ్స్ లో 8 వికెట్ల నష్టానికి 566 పరుగల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ఆ త‌ర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ జ‌ట్టు రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి వికెట్ న‌ష్టానికి 31 ర‌న్స్ చేసింది. విండీస్ ఓపెన‌ర్ రాజేంద్ర చంద్రిక వికెట్‌ను ష‌మీ తీశాడు. భార‌త్ ఇంకా 535 ప‌రుగులు ఆధిక్యంలో ఉంది.

కెప్టెన్ కోహ్లీ తన అప్రతిహత ఫామ్‌కు కొనసాగింపు అన్నట్లుగా డబుల్ సెంచరీతో(283 బంతుల్లో 200, 24 ఫోర్లు) చెలరేగితే అశ్విన్(253 బంతుల్లో 113) కూడా శతకం సాధించాడు. కెరీర్‌లో తొలి ద్విశతకంతో విజృంభించిన విరాట్.. నైట్ వాచ్‌మన్ అశ్విన్ జతగా సులువుగా పరుగులు కొల్లగొట్టాడు. విదేశీగడ్డపై డబుల్ సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డు సాధించాడు. 1990లో న్యూజిలాండ్‌పై అజరుద్దీన్ చేసిన 192 పరుగులే ఇప్పటి వరకు అత్యుత్తమ స్కోరు. ఓ వైపు కోహ్లీ ద్విశతకంతో కదంతొక్కితే మరోవైపు స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌ను తలపిస్తూ అశ్విన్ కూడా బ్యాటు ఝులిపించాడు.

దీంతో టీ విరామ సమయానికి భారత్ 154 ఓవర్లలో 6 వికెట్లకు 512 పరుగులు చేసింది. మరో మూడు మూడు రోజులు మిగిలున్న మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను స్వల్పస్కోరుకే కట్టడి చేస్తే విజయం మనదే. అంతకుముందు 302/4 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ అంతగా ప్రభావం చూపని అంటిగ్వాపిచ్‌పై ఆదినుంచే చెలరేగింది. టెస్ట్ మొదటి రోజే అద్భుత ఇన్నింగ్స్‌తో సెంచరీని తన ఖాతాలో వేసుకున్న కోహ్లీ..చూడచక్కని షాట్లతో అలరించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  West Indies tour  India vs West Indies 2016  Team india  BCCI  cricket  

Other Articles