pressure of expectations is a blessing for me says kohli

Pressure of expectations is a blessing for me says indian skipper

india vs west indies, west indies vs india, ind vs wi, wi vs ind, india tour of west indies, india cricket, west indies cricket, virat kohli, Jason Holder, Test series, anil kumble india, kumble cricket, kumble bowling, cricket, sports news, sports

Virat Kohli scored his first ever double hundred and written a record on his name as Indian Test skipper 200 runs outside sub continent.

అభిమానుల అశీర్వాదంతోనే డబుల్ ధమాకా..

Posted: 07/23/2016 05:26 PM IST
Pressure of expectations is a blessing for me says indian skipper

ఆంటిగ్వా టెస్టులో డబుల్ సెంచరీ చేయడానికి కారణం భారతీయ అభిమానులేనని విరాట్ కోహ్లీ వెల్లడించాడు. వెస్టిండీస్లో మెరుగ్గా ఆడలేడని తనపై విమర్శలున్నాయని, అయితే ఇక్కడ కూడా తాను అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాలని వంద కోట్ల భారత అభిమానులు కోరుకుంటున్నారని తెలిపాడు. ఆ ఒత్తిడినే తనకు ఆశీర్వాదంగా భావించి మెరుగైన ఇన్నింగ్స్ ఆడినట్లు చెప్పాడు. ఒత్తినిని జయించాలన్న అశావాధ దృక్పధమే తనను విజయాల వైపు నడిపిస్తుందని అన్నాడు.

ఐదేళ్ల కింద ఇక్కడ మూడు టెస్టులాడినా కేవలం 76 పరుగులే చేయడం తనను నిరాశకు గురిచేసిందన్నాడు. ఈసారి కోహ్లీ విండీస్ గడ్డపై రాణించాలని ఫ్యాన్స్ కోరుకున్నారని, ప్రస్తుతం అది సాధ్యమైందని అభిప్రాయపడ్డాడు. సెంచరీనే నమోదు చేయని గడ్డపై ఏకంగా డబుల్ సెంచరీ సాధించినందుకు ఈ సిరీస్ తనకెప్పుడూ ప్రత్యేకమేనని కోహ్లీ అంటున్నాడు. క్రీజులో ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉండాలని భావిస్తుంటానని, అందుకే మరో ఎండ్ లో కూడా తానే ఉన్నట్లు ఫీలవుతుంటానని మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు.

విదేశాల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్గా కోహ్లి నిలిచాడు. గతంలో ఈ రికార్డు మహమ్మద్ అజహర్ (192) పేరున వుండగా, దానిని విరాట్ కోహ్లీ తన పేరున తిరగరాసుకున్నాడు. ఉపఖండం బయట 2006 తర్వాత డబుల్ సెంచరీ చేసిన భారత ఆటగాడు కోహ్లీ. విండీస్ గడ్డపై డబుల్ సెంచరీ చేసిన ఐదో భారత ఆటగాడు కోహ్లి. గతంలో ఎంఎస్ ధోనీ, సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, మన్సూర్ అలీఖాన్ పటౌడీ మాత్రమే ఈ ఘనత సాధించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  West Indies tour  India vs West Indies 2016  Team india  BCCI  cricket  

Other Articles