England cricket star Ben Stokes faces jail if he breaks driving ban after being caught speeding four times

Ben stokes faces jail term if found driving in 2016

Ben Stokes, england, jail, bike ride, over speed, Northallerton Magistrate, wrong message, Yorkshire, cricket

England all-rounder Ben Stokes might get jailed if he is caught driving again in the next six months, the Northallerton Magistrates Court has warned.

ఆ క్రికెటర్ వాహనం నడిపితే కటకటాల్లోకే

Posted: 06/16/2016 07:58 PM IST
Ben stokes faces jail term if found driving in 2016

ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ గుర్తున్నాడా!, వరల్డ్ టీ 20 కప్ ఫైనల్లో వెస్టిండీస్ ఆటగాడు కార్లోస్ బ్రాత్వైట్ చేతిలో ఊచకోతకు గురైన ఆటగాడు. చివరి ఓవర్ లో వరుసగా నాలుగు సిక్సర్లు సమర్పించుకుని ఇంగ్లండ్ కు టీ 20 కప్ను దూరం చేశాడు.  అయితే ఈ ఆల్ రౌండర్ కు  ఇప్పుడు ఓ చిక్కొచ్చిపడింది.  మరో ఆరు నెలల పాటు ఆ క్రికెటర్ రోడ్లపై డ్రైవ్ చేసినట్లైతే  జైలు శిక్షను అనుభవించాల్సి వస్తుందని కోర్టు హెచ్చరించింది.

అంతకుముందు నాలుగు సార్లు ఓవర్ స్పీడ్తో డ్రైవ్ చేసి పోలీసులకు పట్టబడటమే ఇందుకు కారణం. గంటకు  యాభై కిలోమీటర్ల వెళ్లాల్సిన జోన్లో 75కి.మీకు పైగా డ్రైవ్ చేసి స్టోక్స్ పోలీసులకు చిక్కాడు. ఈ మేరకు అతనిపై నమోదైన పలు చార్జిషీట్లను పరిశీలించిన కోర్టు అతనిపై తీవ్రంగా మండిపడింది.  దాంతో పాటు 2016 వరకూ ఏ విధమైన వాహనాలను డ్రైవింగ్ చేయరాదంటూ ఆదేశించింది. ఒకవేళ కోర్టు ఆదేశాన్ని ఉల్లంఘిస్తే జైలు శిక్ష ఖాయమని స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ben Stokes  england  jail  bike ride  over speed  cricket  

Other Articles