New Zealand Cricket drops Billy Bowden from international panel

Billy bowden demoted to nzc s national panel

New Zealand Cricket Team,Billy Bowden,Cricket latest Cricket news, World T20, 2016,Cricket latest World T20, 2016 cricket news

Billy Bowden, known for his unusual mannerisms, has been dropped by New Zealand Cricket as an international umpire

న్యూజీలాండ్ అంపైర్ బిల్లీ బౌడెన్ మళ్లీ తప్పాడు..

Posted: 06/16/2016 07:07 PM IST
Billy bowden demoted to nzc s national panel

విలక్షణమైన శైలితో ప్రపంచ క్రికెట్ లో తనదైన ముద్ర వేసిన న్యూజిలాండ్ అంపైర్ బిల్లీ బౌడెన్ మరోసారి తన కీలకమైన మ్యాచ్ లో మరోమారు ఔటయ్యాడు. అదేంటి అంపఐర్ ఔట్ అవ్వడమేంటి అంటారా..? అదేనండా ఆయన మరోమారు అంతర్జాతీయ మ్యాచ్లకు  దూరం కానున్నాడు.  న్యూజిలాండ్ అంతర్జాతీయ క్రికెట్ అంపైర్ల ప్యానెల్లో అతనికి చోటు దక్కలేదు. ఈ మేరకు  బిల్లీ బౌడెన్ను దేశవాళీ మ్యాచ్లకు మాత్రమే పరిమితం చేస్తూ న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తాజాగా నిర్ణయం తీసుకుంది.

ఇప్పటివరకూ అంతర్జాతీయంగా  84 టెస్టులు, 200 వన్డేలకు అంపైరింగ్ చేసిన బిల్లీ బౌడెన్.. 24 టీ 20 మ్యాచ్లకు బాధ్యతలు నిర్వర్తించాడు. 1995లో అంతర్జాతీయ అంపైర్ గా కెరీర్ ను ప్రారంభించిన బిల్లీ.. 2013లో  అంతర్జాతీయ అంపైరింగ్ ప్యానెల్లో తొలిసారి చోటు కోల్పోయాడు. 2014లో తిరిగి అంతర్జాతీయ ప్యానెల్లో చోటు దక్కించుకున్న బిల్లీ బౌడెన్.. రెండు సంవత్సరాల వ్యవధిలోనే మరోసారి తన పదవి నుంచి డిమోట్ కావడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Billy Bowden  New Zealand  Umpire Cricket  

Other Articles