Australia v West Indies: Mitchell Starc, Aussie spinners star in ODI win

Spinners lift australia to bonus point win

Tri-Nation Series, Australia, West Indies, Nathan Lyon, Adam Zampa, West Indies vs Australia, west indies, Kieron Pollard, Sunil Narine, Phil Simmons, West Indies vs South Africa, Guyana, Dwayne Bravo, Chris Gayle

Nathan Lyon and Adam Zampa helped Australia register an easy six-wicket win over hosts West Indies in the second One-Day International of Tri nation series,

ముక్కోణపు సిరీస్ ను మలుపుతిప్పిన స్పిన్నర్లు..

Posted: 06/06/2016 07:27 PM IST
Spinners lift australia to bonus point win

ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా దక్షిణాఫ్రికాపై విజయంతో రెట్టించిన ఉత్సాహంతో అసీస్ పై గెలుపు నమోదు చేస్తారని భావించిన అతిధ్య జట్టుకు కంగారులు కంగారెత్తించారు. విండీస్ అంచనాలను తారుమారు చేసి ఏకపక్ష విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఇవాళ వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా 6 వికెట్లతో విజయం సాధించింది. ఆసీస్ స్పిన్నర్లు ఆడమ్ జంపా (3/16), నాథన్ లియాన్ (3/39) విజృంభించి విండీస్ బ్యాట్స్మెన్ను కట్టడి చేశారు.

దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన కరీబియన్లు 32.3 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటయ్యారు. విండీస్ జట్టులో ఓపెనర్ చార్లెస్ (22) టాప్ స్కోరర్. అనంతరం 117 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన కంగారూలు 25.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి విజయతీరాలకు చేరారు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (55) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. విండీస్ బౌలర్ సునీల్ నరైన్ రెండు వికెట్లు తీశాడు. భారీ విజయం సాధించిన ఆసీస్కు బోనస్ సహా 5 పాయింట్లు దక్కాయి. ఈ సిరీస్లో తొలి వన్డేలో వెస్టిండీస్.. దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tri-Nation Series  Australia  West Indies  West Indies vs Australia  

Other Articles