i have applied for head coachs post says ravi shastri

Shastri throws his hat into the ring

ravi shastri, ravi shastri india coach, india cricket team coach, team india coach, ravi shastri cricket, cricket ravi shastri, sandeep patil, cricket

Former Team India director Ravi Shastri applied for the chief coach's post of the Indian cricket team, staking strong claims of returning at the helm.

కోచ్ పదవి కోసం బిసిసిఐకి దరఖాస్తు చేశా

Posted: 06/07/2016 07:09 PM IST
Shastri throws his hat into the ring

భారత క్రికెట్ ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసినట్లు జట్టు మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి స్పష్టం చేశాడు. ఈ మేరకు సోమవారం దరఖాస్తు ఫామ్ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి అందజేసినట్లు రవిశాస్త్రి తెలిపాడు.చీఫ్ కోచ్ పదవికి ఆప్లై చేశా. కోచ్ పదవి కోసం ఇచ్చిన ప్రకటనలో ఏమైతే అడిగారో దాన్ని ఈ-మెయిల్ ద్వారా బోర్డుకు అందజేశా. ఇంకా బీసీసీఐ ఏమైనా కోరితే వాటిని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. అయితే ఈ పదవిపై మీరు నమ్మకంగా ఉన్నారా?లేరా?అని అడిగితే అది నా చేతుల్లో లేదు అని అన్నారు.
 
నా పని దరఖాస్తు చేయడం మాత్రమే. ఆపై ఇంక ఎటువంటి కామెంట్లు చేయదలుచుకోలేదు'అని రవిశాస్త్రి తెలిపాడు. అంతకుముందు టీమిండియా డైరెక్టర్గా రవిశాస్త్రి 18 నెలలు పనిచేసిన సంగతి తెలిసిందే. వన్డే వరల్డ్ కప్ అనంతరం డంకెన్ ఫ్లెచర్ పదవీ కాలం ముగియడంతో జట్టు బాధ్యతలను రవిశాస్త్రికి అప్పజెప్పారు. ప్రస్తుతం బీసీసీఐ పూర్తిస్థాయి కోచ్ను నియమించే పనిలో భాగంగా ప్రకటనల ద్వారా ఆ నియమాకాన్ని చేపట్టేందుకు సిద్ధమయ్యింది.  మరోవైపు చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ కూడా కోచ్ పదవికి పోటీ పడుతున్నాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi Shastri  india  coach  cricket  BCCI  

Other Articles