India bounce back in style to crush Sri Lanka

India won second t20 match with 69 runs against sri lanka

india vs srilanka t20, shikar dhawan, suresh raina, pandya, Chameera, Chandimal, Cricket, India, MS Dhoni, Rajitha, Ranchi, Rohit Sharma, Shanaka, Sports, Sri Lanka, Sri Lanka in India 2016

India have drawn level in the series. Dhoni started it off with a brisk fifty. Sri Lanka fought back in the middle but then Raina and Pandya got together and provided the momentum again with 59 runs off 4.2 overs,

రెండో టీ20లో లంకను కసితీరా ఉతికి ఆరేశారు..

Posted: 02/13/2016 02:03 PM IST
India won second t20 match with 69 runs against sri lanka

తొలి టి20లో ఘోర ఓటమికి టీమిండియా సేన ప్రతీకారం తీర్చుకుంది. రెండో టీ 20లో శ్రీలంకను కసితీరా ఉతికి ఆరేశారు. ఫలితంగా 69 పరుగులతో ధోని సేన ఘన విజయం సాధించింది. కెప్టెన్ ధో్ని సొంత గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో  ఒపనర్లు శిఖర్ ధావన్ (25 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) జోరుకు, రోహిత్ శర్మ (36 బంతుల్లో 43; 2 ఫోర్లు, 1 సిక్సర్) అండగా నిలవడంతో... రెండో టి20 మ్యాచ్‌లో టీమిండియా 69 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసింది. రైనా (19 బంతుల్లో 30; 5 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నారు. అనంతరం లంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులకే పరిమితమైంది. కపుగెడెర (27 ) టాప్ స్కోరర్. చండిమల్ (31), షనక (27) మోస్తరుగా ఆడారు. గుణతిలక (2), దిల్షాన్ (0), ప్రసన్న (1)లు స్వల్ప వ్యవధిలో అవుట్‌కావడంతో లంక 16 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుంది. చండిమల్, కపుగెడెరా నిలకడగా ఆడినా నిష్పల్పంగా మారింది.

కాగా సిరివర్ధన  (28 నాటౌట్), షనక భారీ షాట్లతో ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. పెరీరా (0), సేననాయకే (0), చమీరా (0)లు అవుట్ కావడంతో లంకకు ఓటమి తప్పలేదు. అశ్విన్ 3, నెహ్రా, జడేజా, బుమ్రా తలా రెండు వికెట్లు తీశారు. 22 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన శిఖర్ ధావన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య చివరి టి20 ఆదివారం వైజాగ్‌లో జరుగుతుంది.

స్కోరు వివరాలు

భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి అండ్ బి) చమీరా 43; ధావన్ (సి) చండిమల్ (బి) చమీరా 51; రహానే (సి) దిల్షాన్ (బి) సేననాయకే 25; రైనా (సి) చమీరా (బి) పెరీరా 30; హార్దిక్ పాండ్యా  (సి) గుణతిలక (బి) పెరీరా 27; ధోని నాటౌట్ 9; యువరాజ్ (సి) సేననాయకే (బి) పెరీరా 0; జడేజా నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 196.

వికెట్ల  1-75; 2-122; 3-127; 4-186; 5-186; 6-186.

బౌలింగ్: రజిత 4-0-45-0; పెరీరా 3-0-33-3; సేననాయకే 4-0-40-1; చమీరా 4-0-38-2; ప్రసన్న 3-0-21-0; సిరివర్ధన  1-0-6-0; షనక 1-0-12-0

శ్రీలంక ఇన్నింగ్స్: గుణతిలక (సి) ధోని (బి) నెహ్రా 2; దిల్షాన్ (స్టంప్) ధోని (బి) అశ్విన్ 0; ప్రసన్న (సి) యువరాజ్ (బి) నెహ్రా 1; చండిమల్ (స్టంప్) ధోని (బి) జడేజా 31; కపుగెడెర (సి) పాండ్యా (బి) జడేజా 32; సిరివర్ధన నాటౌట్ 28; షనక (సి) రైనా (బి) అశ్విన్ 27; పెరీరా (సి) రహానే (బి) అశ్విన్ 0; సేననాయకే ఎల్బీడబ్ల్యు (బి) బుమ్రా 0; చమీరా (బి) బుమ్రా 0; రజిత నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 127.

వికెట్లు: 1-2; 2-3; 3-16; 4-68; 5-68; 6-116; 7-117; 8-119; 9-119. బౌలింగ్: అశ్విన్ 4-0-14-3; నెహ్రా 3-0-26-2; యువరాజ్ 3-0-19-0; జడేజా 4-0-24-2; రైనా 2-0-22-0; బుమ్రా 3-0-17-2; పాండ్యా 1-0-5-0.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  srilanka  india vs srilanka t20  cricket  cricket news  

Other Articles