Virat Kohli giving competetion in sachin records

Virat kohli giving competetion in sachin records

sachin, Virat Kohli, Records, Sachin Tendulkar, Virat Kohli Record

Performance in any sport is measured by numbers. Some stats stand so tall that they evoke a certain feeling of nostalgia without having to make an effort to explain its significance with verbose back stories. It’s the same with cricket. 99.94, 34357, 800, 438-9. All these numbers tell a story which needs no explanation.

విరాట్ కోహ్లీ Vs సచిన్ టెండూల్కర్

Posted: 02/04/2016 06:15 PM IST
Virat kohli giving competetion in sachin records

కొత్త రికార్డులను రాయడం.. వాటిని వెనక వచ్చే వాళ్లు తిరిగరాయడం మామూలే. అయితే తాజాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కు, విరాట్ కోహ్లీకి మధ్యన రసవత్తరమైన పోటీ నడుస్తోంది. ఆస్ట్రేలియా సిరీస్ లో దూకుడుగా బ్యాటింగ్ చేసిన కోహ్లీ సచిన్ రికార్డును బ్రేక్ చెయ్యడానికి సిద్దంగా ఉన్నారు. సచిన్ కన్నా కూడా విరాట్ కోహ్లీ గ్రేట్ అంటూ చాలా మంది కితాబిస్తున్నారు. విరాట్ సక్సెస్ రేట్ చూస్తే మీకే అర్థమవుతుందని కొంత మంది కాదు కాదు సచినే గ్రేట్ అని మరికొందరు అంటున్నారు.

బ్యాటింగ్ ఆర్డర్ ను గమనిస్తే.. సచిన్ తాను ఆడిన తొలి 70 వన్డేల వరకు 5వ స్థానంలో లేదా 6వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. అదే కోహ్లి విషయానికి వస్తే.. వన్ డౌన్ బ్యాట్స్ మెన్ గా రావడం జరుగుతోంది. కోహ్లి 41 టెస్టుల్లో 72 ఇన్నింగ్స్ లు ఆడితే.. సచిన్ కు 41 టెస్టుల్లో 60 ఇన్నింగ్స్ మాత్రమే ఆడే అవకాశం వచ్చింది. కోహ్లి 4 సార్లు నాటౌట్ గా నిలిస్తే.. సచిన్ 7 సార్లు నాటౌట్ గా నిలిచాడు. పరుగుల విషయానికి వస్తే కోహ్లి 2వేల 994 రన్స్ చేస్తే.. సచిన్ 2వేల 911 పరుగులు నమోదు చేశాడు. విరాట్ హయ్యస్ట్ ఇండివిజువల్ స్కోర్ 169 పరుగులు కాగా, సచిన్ అత్యధిక వ్యక్తిగత స్కోర్ 179. ఇక యావరేజ్ విషయానికి వస్తే కోహ్లి 44.02 శాతం కాగా, సచిన్ యావరేజ్ 54.92. విరాట్ 11 శతకాలు, 12 హాఫ్ సెంచరీలు బాదితే.. సచిన్ 10 సెంచరీలు, 14 అర్థ సెంచరీలో కొట్టాడు. అప్పటి సచిన్ ను, ఇప్పటి కోహ్లిని పోల్చి చూడటం ఎంతవరకు కరెక్ట్ అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. కచ్చితంగా ఏదో ఒక రోజు సచిన్ రికార్డులన్నింటిని విరాట్ కోహ్లి బ్రేక్ చేస్తాడు. అంత మాత్రాన సచిన్ కన్నా విరాట్ కోహ్లినే గొప్ప అని చెప్పడం సమంజసం కాదేమో.కానీ క్రికెట్ అభిమానులు మాత్రం సచిన్ తర్వాత సచిన్ అంతటి వ్యక్తి టీమిండియాకు దొరికాడు అంటూ తెగ ఆనందపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sachin  Virat Kohli  Records  Sachin Tendulkar  Virat Kohli Record  

Other Articles