India beats Australia to complete T20 series sweep

India beats australia to complete t20 series sweep

Australia, India, Yuvaraj, Suresh raina, Kohli, Rohith Sharma

Australia captain Shane Watson struck the second-highest Twenty20 international score ever but his 124 not out went in vain as a combined batting effort helped India score a thrilling last-ball victory to complete a 3-0 whitewash on Sunday. Opener Rohit Sharma (52), Virat Kohli (50) and Suresh Raina (49 not out) helped India reach 200-3 in reply to Australia’s 197-5.

మూడో టీ20లో టీమిండియా విక్టరీ.. సిరీస్ క్లీన్ స్వీప్

Posted: 01/31/2016 05:57 PM IST
India beats australia to complete t20 series sweep

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టి-20లో టీమిండియా ఘనవిజయం సాధించింది. చివర వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 4 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి టీమిండియా 200 పరుగులు చేసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అర్థ సెంచరీలతో రాణించగా, చావోరేవో అనేలా సాగిన చివరి ఓవర్లో సిక్స్, ఫోర్‌తో యువరాజ్ సింగ్ టీమిండియాను విజయం ముంగిట నిలబెట్టాడు. రైనా 25 బంతుల్లో 49 పరుగులు చేసి, చివరి బంతికి ఫోర్ చేసి విన్నింగ్ షాట్ చేశాడు. ఈ విజయంతో టీమిండియా ఆస్ట్రేలియాతో జరిగిన టి-20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. వన్డే సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా టి-20 సిరీస్‌ను గెలిచి సత్తా చాటింది.

లాస్ట్ ఓవర్లో ఒక్కో బాల్.. ఏం జరుగుతుందా అన్న టెన్షన్ ను క్రియేట్ చేసింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య టీమిండియా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. క్రికెట్ స్టేడియంలో అందరికి నరాలు తెగే టెన్షన్ ను, ఇంట్రస్ట్ ను కలిగించిన చివరి ఓవర్ లో ప్రతి బాల్ అభిమానుల గుండెల్లో రైలు పరుగెత్తించింది. చివరి ఓవర్ ఎలా సాగిందో చూడండి.
ఫస్ట్ బాల్.. యువరాజ్ సింగ్ ఫోర్
సెకండ్ బాల్.. సిక్స్
ధర్డ్ బాల్.. వన్ రన్
ఫోర్త్ బాల్.. టూ రన్స్
ఫిఫ్త్ బాల్.. టూ రన్స్
సిక్త్స్ బాల్.. ఫోర్

భారత్ తో జరుగుతున్న ఆఖరి టీ ట్వంటీ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 197 భారీ స్కోరు చేసింది. షేన్ వాట్సన్ 124( 74 బంతులలో 10 ఫోర్లు 6 సిక్సర్లు ) పరుగులతో అజేయ సెంచరీ నమోదు చేసుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా జట్టు16 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఆశిష్ నెహ్రా బౌలింగ్ లో ఖవాజా (6 బంతుల్లో 14 పరుగులు) ఔటయ్యాడు. 3వ ఓవర్ లో రెండో బంతికి మీడియం పేసర్ నెహ్రా ఓపెనర్ ఖవాజాను పెవిలియన్ కు పంపాడు. 69 పరుగుల టీమ్ స్కోర్ వద్ద మార్ష్ (12 బంతుల్లో 9 పరుగులు) రెండో వికెట్ గా వెనుదిరిగాడు. అశ్విన్ బౌలింగ్ లో మార్ష్.. క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 168 పరుగుల వద్ద హెడ్(26 పరుగులు ), 193 పరుగుల వద్ద లైన్ (13 పరుగులు) జడేజా బౌలింగ్ లో ఔటయ్యాడు. భారత బౌలింగ్ లో నెహ్రా , బుమ్ రా , అశ్విన్ జడేజా , యువరాజ్ సింగ్ తలా ఒక వికెట్ లభించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Australia  India  Yuvaraj  Suresh raina  Kohli  Rohith Sharma  

Other Articles