This is the team India cricket team for world T20

This is the team india cricket team for world t20

Team India, India, World T20, Dhoni, sami, Jasprit Bhumrah, Hardik Pandya

Young all-rounder Pawan Negi was the surprise pick for the World Twenty20 and Asia Cup while the selectors also reposed faith in veterans such as Yuvraj Singh and Harbhajan Singh in the 15-member Indian squad for the two events. Other young players such as Jasprit Bhumrah and Hardik Pandya, who impressed in the recent series against Australia, also found a place in the squad announced by BCCI Secretary Anurag Thakur after a meeting of the selection committee here on Friday.

వరల్డ్ టీ20లో పాల్గొనే టీమిండియా జట్టు ఇదే

Posted: 02/05/2016 04:34 PM IST
This is the team india cricket team for world t20

ఐసీసీ వరల్డ్ టీ20, ఆసియా కప్ టోర్నమెంట్‌లకు సందీప పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది. రెండు సిరీస్‌లకు ధోనీనే నాయకత్వం వహించనున్నట్లు చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్, బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. వరల్డ్ టీ20 టోర్నమంట్‌కు తొలిసారి భారత్ ఆతిథ్యం ఇస్తుంది

మార్చి 8 నుంచి ఏప్రిల్ 3 వరకు ఈ వరల్డ్ టీ20 టోర్నమెంట్ జరగనుంది. రెండు సిరీస్‌లకు ఒకే జట్టును ఎంపిక చేసిన సెలెక్షన్ కమిటీ, ఆయా సిరీస్‌లకు ఈ జాబితా నుంచే ఆటగాళ్లను ఖరారు చేయనుంది. వరల్డ్ టీ20 జట్టులో టీమిండియా పేసర్లు భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మలకు చోటు దక్కలేదు. కాగా ధోని ఇప్పటివరకు 28 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్వవహరించాడు. అందులో భారత్ జట్టు 18 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, 9 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. ఈ టోర్నమెంట్ భారత్‌లో జరగుతుండటంతో టైటిల్ బరిలో భారత్ జట్టు ఫేవరేట్‌గా ఉంది. మార్చి 19న ధర్మశాలలో భారత్, పాక్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్మీని మొత్తం 3 దశలుగా విభజించారు. టోర్నీలో మొత్తం 16 దేశాలకు చెందిన జట్లు పాల్గొంటున్నాయి. వరల్డ్ టీ20 టోర్నమెంట్‌ను భారత్‌లోని ఏడు నగరాల్లో నిర్వహించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Team India  India  World T20  Dhoni  sami  Jasprit Bhumrah  Hardik Pandya  

Other Articles