jindal group stepped back from owning IPL royal challengers bangalore team

Ipl star crossed team owners hit by bad luck

Vijay Mallya, Subrata Roy, Venkattram Reddy, financial fraud, Maran brothers, home ministry, security clearances Shah Rukh Khan, Mukesh Ambani, Lalit Modi, IPL Bad Luck, Indian Premier League franchise, superstition, Sunanda Pushkar, Ness Wadia, Preity Zinta, Srinivasan, Gurunath Meiyappan, raj kundra, shilpa shetty, Justice Lodha committee,

A leading Mumbai businessman, once interested in buying an Indian Premier League franchise today wants nothing to do with the glamorous cricket league as he believes IPL is bringing bad luck to team owners.

ఐపీఎల్.. యజమానులకు కీడు చేస్తున్నాయా.?

Posted: 07/17/2015 11:18 PM IST
Ipl star crossed team owners hit by bad luck

ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఐపీఎల్.. భారత దేశ చరిత్రలో డబ్బుల వరదను కురిపించిన లీగ్. అయితే ఇలాంటి లీగ్ లను సోంతం చేసుకోవాలని అనేకమంది ఆది నుంచి పోటీపడుతున్నారు. కాగా నిన్న మొన్నటి వరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును కోనేందుకు సన్నధమైయ్యి.. అన్ని ఏర్పాటు చేసుకున్న తరుణంలో వెనక్కు తగ్గింది. అందుకు కారణం ఒక్కటే. అదే మూఢనమ్మకం. అదేంటి వ్యాపార దిగ్గజం జిందాల్ గ్రూపు మూఢనమ్మకాలను విశ్వసిస్తుందా..? అనుకుంటున్నారా..? సరిగ్గా అలాంటిదే. అయితే అందుకు తగ్గ ఆధారాలను కూడా చూసిన తరువాత ఐపీఎల్ మనకెందుకంటూ వెనకడుగు వేస్తోందట జిందాల్ గ్రూపు.

లీగ్ దశలో చెన్నై సూపర్ కింగ్స్ సహా రాజస్థాన్ రాయల్స్ జట్లను రెండేళ్ల పాటు పక్కన బెట్టాలని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ లోధా కమిటీ తీర్పునిచ్చిన నేపథ్యం ఒక కారణం కాగా, ఐపీఎల్ యాజమాన్యాలు డబ్బులను ఆర్జిస్తున్నా.. వాటి యజమానులకు మాత్రం కీడు చేస్తున్నాయన్న మూడనమ్మకం మరో కారణమని తెలుస్తోంది. ఐపీఎల్ వ్యవస్థాపక చైర్మన్ లలిత్ మోడీతో మొదలు పెట్టుకుంటే.. దానికి చిక్కిన ఒక్కిరద్దరని మినహాయించి అందరినీ అది కష్టాల ఊబిలోకి నెట్టిందని జిందాల్ గ్రూపు వెనకంజ వేసినట్లు తెలుస్తుంది.

ఎన్ శ్రీనివాసన్ తన మేనల్లుడు గురునాథ్ మొయప్పన్ ను జీవిత కాలం పాటు నిషేధం విధించుకున్నారు. ఆయన కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కుని చివరకు బిసిసిఐ అధ్యక్ష పదవిని వదులుకున్నారు. రాజ్ కుంద్రా కూడా ఎలాంటి క్రికెట్ టోర్నీలనో పాల్గోనకుండా నిఫేధించబడ్డారు. విజయ్ మాల్యా ఐపీఎల్ ను చేపట్టిన నాటి నుంచి తన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ఇబ్బందులు పడగా, యూబి గ్రూపు తన ఆధీనంలో నుంచి పక్కకు జారుతుంది. సుబ్రతా రాయ్ సహారా ఈ పేరు చెప్పగానే అనేక ఏళ్ల పాటు టీమిండియా, ఐపీఎల్ స్పాన్సరర్ గా వున్న ఆయన ప్రస్తుతం జైలులో ఊచలు లెక్కబెడుతున్నారు. అయనకు బెయిల్ పోందేందుకు కూడా డబ్బులు జమకావడం లేదు.

కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్, ఆయన మూడవ సతీమణి సునందా పుష్కర్ ల అంశం తీసుకుంటే ఐపీఎల్ లో జట్టును తీసుకోగానే ఆయన కేంద్ర మంత్రి పదవికే ఎసరు వచ్చింది. ఇక సునందా పుష్కర్ స్వర్గస్థురాలైంది. డెక్కన్ చార్జర్ యజమాని వెంకట్రామిరెడ్డి కూడా ఐపీఎల్ జట్టు తీసుకున్న తరువాత ఆయన ఫోర్జరీ కేసు బయటపడింది. దీంతో ఆయన జట్టును బిసిసిఐ రద్దు చేసింది. ఇక మారెన్ సోదరులు జట్టును తీసుకున్న తరువాత ఇబ్బందులకు గురయ్యారు. వారి స్పైస్ జెట్, అమ్మకాలకు పెట్టిన వారు.. సన్ గ్రూప్ మీడియా సెక్యూరిటీ క్లియరెన్స్ విషయంలో ఇంకా ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. దీంతో ఐపీఎల్ జట్టు యజమానులకు మంచి చేయడం మాని కీడు చేస్తుందన్న వార్తల నేపథ్యంలో జిందాల్ గ్రూప్ వెనక్కు తగ్గినట్లు సమాచారం.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Subrata Roy  Shah Rukh Khan  Mukesh Ambani  Lalit Modi  IPL Bad Luck  

Other Articles