అంతర్జాతీయ క్రికెట్ నుంచి మరో స్పిన్నర్ దూరం కానున్నాడు. అనుమానాస్పద బౌలింగ్ అంశమే ఇందుకు కారణమవుతోంది. పాకిస్ధాన్ ఆఫ్ స్నిన్నర్, ఆల్ రౌండర్ మొహమద్ హఫీజ్ బౌలింగ్‌ను నిషేధిస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుక్రవారం ప్రకటించింది. ఈనెల 6వ తేదీన చెన్నైలోని శ్రీ రామచంద్ర యూనివర్సిటీలో అతడి బౌలింగ్ యాక్షన్‌ను పరీక్షించిన ఐసీసీ.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి హాఫీజ్ ను 12 నెలలు పాటు నిషేధించింది. శ్రీలంకపై (జూన్ 17-21)న గాలెలో జరిగిన తొలి టెస్టులో మ్యాచ్ అఫీసియల్స్ మొహమద్ హఫీజ్ బౌలింగ్‌పై తమ సందేహాలను వెలిబుచ్చారు. మ్యాచ్ అనంతరం మొహమద్ హఫీజ్ ఐసీసీ రూల్స్ ప్రకారం తన బౌలింగ్ యాక్షన్‌పై చెన్నైలో పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షల్లో హఫీజ్ విఫలం కావడంతో అతడిపై ఏడాది పాటు ఐసీసీ నిషేదం విధించింది.
మొహమద్ హఫీజ్ బౌలింగ్ వేసే సమయంలో తన మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచుతున్నట్లు పరీక్షల్లో నిర్దారణ కావడంతో ఐసీసీ ఈ చర్యకు ఉపక్రమించింది. గతేడాది నవంబర్‌లో అబుదాబిలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ మొదటి టెస్ట్‌లో హాఫీజ్ బౌలింగ్‌పై విమర్శలు రావడంతో అతని బౌలింగ్‌పై ఐసీసీ నిషేదం విధించింది. అయితే మళ్లీ ఏప్రిల్ 2015లో మరోసారి హఫీజ్ బోలింగ్‌పై మ్యాచ్ అఫీసియల్స్‌కు అనుమానాలు రేకెత్తడంతో పరీక్షకు హాజరవ్వాల్సిందిగా ఐసీసీ కోరింది. రెండేళ్ల వ్యవధిలో హపీజ్ రెండో పర్యాయం అనుమానాస్పద బౌలింగ్ వేయడంతో తొలిసారి సస్పెండ్ కు గురైన అతను రెండో పర్యాయం కూడా అనుమానస్పద బాలింగ్ వేయడంతో అంతర్జాతీయ క్రికెట్ నుంచి 12 నెలల పాటు నిషేధించబడ్డాడు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more