bhuvaneshwar, rahane, vijay help India beat Zimbabwe by 62 runs

India take unbeatable 2 0 lead beat zimbabwe by 62 runs

ambati rayudu, india, india tour of zimbabwe 2015, Team india, Stuart Binny, rayudu and binny partnership, india vs zimbabwe, india vs zimbabwe 2015, zimbabwe, zimbabwe vs india, zimbabwe vs india 2015, ind vs zim, ind vs zim 2015, Ambati Rayudu, Elton Chigumbura, Stuart Binny, Zimbabwe, Zimbabwe vs India, Zimbabwe vs India 2015

India, defending 271/8, made life difficult for Zimbabwe as Bhuvneshwar Kumar-led pace attack kept on making timely inroads. Bhuvi registered figures of 4/33 while Harbhajan Singh and Dhawal Kulkarni chipped in with wicket apiece.

జింబాబ్వేపై సీరీస్ గెలిచిన టీమిండియా.. అద్భుతంగా రాణించిన భువి

Posted: 07/12/2015 10:02 PM IST
India take unbeatable 2 0 lead beat zimbabwe by 62 runs

జింబాబ్వేతో జరుగుతున్న మూడు వన్డేల సీరిస్ లో భారత్ కైవసం చేసుకుంది. మూడు వన్డేలలో రెండు తొలి రెండు వన్డే మ్యాచ్ లను గెలిచిన ఇండియా.. మరో వన్డే మ్యాచ్ మిగిలివుండగానే సీరీస్ ను కైవసం చేసుకుంది.  తొలి వన్డేలో ఉత్కంఠకర పోరును ఎదుర్కున్న టీమిండియా.. రెండో వన్డేలో సునాయసంగా, ఏకపక్షంగా అతిధ్య జట్టుపై గెలుపు సాధించింది. టీమిండియా జట్టులో సీనియర్లు ఎవరూ లేకున్నా..రహానే సేన మొక్కవోని విశ్వాసంతో సీరీస్ ను సొంతం చేసుకుంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న జింబాబ్వే జట్టను రహానే సేన 62 పరుగులతో ఓడించి రెండు విజయాలతో మూడ వన్డేల సీరీస్ ను కైవసం చేసుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్దేశించిన 272 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే అదిలోనే వికెట్లను కొల్పోయి కష్టాలు పడింది. ఓపెనర్ చమ్మూ చుబాబ్బా మినహా జింబాబ్వే ఆటగాళ్లు ఎవ్వరూ రాణించలేదు. చివరిలో జింబాబ్వే వికెట్ కీపర్ రిచ్ మండ్ ముటుంమబని 32 పరుగులతో స్కోరుబోర్డును ముందుకు నడిపించినా.. ఫలితం లేకపోయింది. మరో ఆరు బంతులు మిగిలి వుండగానే జింబాబ్వే అలౌట్ అయ్యింది. భారత్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ అత్యద్భుతంగా రాణించాడు. పది ఓవరల్లో 33 పరుగులిచ్చిన భువి నాలుగు విక్కెట్లను సాధించాడు. కాగా ధవల్ కుల్ కర్ణీ, హర్బజన్ సింగ్, స్టువర్ట్ బిన్నీ, అక్షర్ పటేల్ లు తలా ఒక్కో విక్కట్ పడగొట్టారు. కాగా మరో రెండు కీలక విక్కెట్లను టీమిండియా కెప్టెన్ అజింక్యా రహానే రన్ అవుట్ రూపంలో పెవీలియన్ కు పంపించారు.

అంతకుముందు టీమిండియా.. అతిధ్య జట్టు ముందు 272 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది. నిర్ణీత యాభై ఓవర్లలో టీమిండియా ఎనమిది విక్కెట్ల నష్టానికి 271 పరుగులు సాధించింది. టీమిండియా కెప్టెప్ అజింక్యా రహేనే.. సహా మురళి విజయ్ లు అద్భుతంగా రాణించి హాఫ్ సెంచరీలతో రాణించారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న జింబాబ్వే.. టీమిండియాను బ్యాటింగ్ బరిలోకి దింపింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా ఒపెనర్లు రహానే, మురళీ విజయ్ 112 పరుగుల వరకు విక్కెట్ కోల్పోకుండా శుభారాంబాన్ని ఇచ్చారు. 112 పరుగుల వద్ద కెప్టెన్ రహానే 63 పరుగుల వ్యక్తిగత స్కోర్కు వద్ద అవుట్ అయ్యి పెవీలియన్ కు చేరుకున్నాడు.

ఆ తరువాత బరిలోకి వచ్చిన అంబటి రాయుడుతో కలసి మురళీ విజయ్ స్కోరుబోర్డును పరుగులెత్తించాడు. ఈ క్రమంలో 72 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మురళీ విజయ్ కూడా వెనుదిరిగాడు. తొలి వన్డేలో శతకాన్ని బాదిన తెలుగు తేజం అంబటి రాయుడు ఈ మ్యాచ్ లోనూ 41 పరుగులు సాధించి ఔటయ్యాడు. ఆ తరువాత భారత్ క్రమంగా విక్కెట్లను కోల్పయింది. మనోజ్ తివారీ 22 పరుగులు, రాబిన్ ఉత్తప్ప 13 పరుగులు, కెదర్ జాదవ్ 16 పరుగులతో వెనుదిరిగారు. తొలివన్డేలో అంబటిరాయుడితో జతకట్టి రాణించిన స్టువర్ట్ బిన్నీ కూడా 25 పరుగులకే వెనుదిరిగాడు.

దీంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి హర్భజన్ సింగ్ ఐదు పరుగులతో, భువనేశ్వర్ కుమార్ ఖాతా తెరవకుండా.. నాటౌట్ గా క్రీజ్ లో వున్నారు. మొత్తానికి ఎనిమిది వికెట్లను కోల్పయిన టీమిండియా 271 పరుగులు సాధించింది.  జింబాబ్వే జట్టులో మజ్దీవా తన కెరీర్ బెస్ట్ ఇన్నింగ్ తో రాణించాడు. 49 పరుగులిచ్చి నాలుగు వికెట్లను పడగోట్టాడు.  డోనాల్డ్ తిరిపానో, చమ్ము చిబ్బాబ్బ, బ్రాయన్ విటోరి, సికిందర్ రజ చెరో వికెట్ ను సాధించారు.  

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  zimbamwe  anbati rayudu  stuart binny  Elton Chigumbura  

Other Articles