T20 has improved spinner's ability: Daniel Vettori

Twenty20 has helped spinners to evolve says daniel vettori

daniel vettori, T20 cricket, IPL spinners, muttiah muralitharan, harbhajan singh, sunil narine, spin bowling, T20 spinners, spin bowling quality, Daniel Vettori, spinners, IPL, royal challengers banglore coach, T20 format

Former New Zealand left-arm spinner Daniel Vettori said that T20 cricket has helped spinners think a step ahead of the batsman and take extra risks

స్పిన్నర్ల సామర్థ్యం పెరగడానికి అది దోహదపడింది

Posted: 06/18/2015 08:30 PM IST
Twenty20 has helped spinners to evolve says daniel vettori

ట్వంటీ- 20 ఫార్మెట్ స్పిన్నర్ల శక్తి సామర్థ్యాలు పెరగటానికి కారణమైందా?, ఆ ఫార్మెట్ తో  స్పిన్నర్లు బ్యాట్స్ మెన్ ఆలోచనలకు చెక్ పెడుతున్నారా? అంటే అవుననే అంటున్నాడు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్  డానియల్ వెటోరి. స్పిన్నర్ల శక్తి సామర్థ్యాలు బాగా పెరగడానికి ట్వంటీ 20 ఫార్మెట్ చాలా బాగా దోహదపడిందని తాజాగా స్పష్టం చేశాడు. బ్యాట్స్ మెన్ ఎదురుదాడిని స్పిన్నర్లు ముందే ఊహించడానికి ట్వంటీ 20 ఫార్మెట్ చక్కటి వేదికగా మారిందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు.
 
ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ కు కోచ్ గా ఉన్న వెటోరి..  ప్రస్తుతం  బిగ్ బాష్ లీగ్ లో బ్రిస్బేన్ హీట్ కు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. ఆద్యంతం బ్యాట్స్ మెన్  గేమ్ గా ఉండే ట్వంటీ 20 ఫార్మెట్ లో స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తున్నారన్నాడు.  ట్వంటీ 20 ల్లో అనేక స్టేజ్ లలో బౌలింగ్ చేసే స్పిన్నర్లు తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళుతున్నారన్నాడు. సాంప్రదాయ శైలిలో బౌలింగ్ చేసే స్పిన్నర్లు జాతీయ జట్టులో స్థానాలను దక్కించుకుంటున్నారని వెటోరి తెలిపాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Daniel Vettori  spinners  IPL  royal challengers banglore coach  T20 format  

Other Articles