Virat Kohli keeps wickets to give MS Dhoni a one-over break | Mirpur Cricket Match

Virat kohli keeps wickets to give ms dhoni a one over break

Virat Kohli, mahendra singh dhoni, india captain dhoni, india test captain kohli, india cricket team members, team india cricket members, bangladesh cricket team, bangladesh india match, mirpur match

Virat Kohli keeps wickets to give MS Dhoni a one-over break : India's Test captain Virat Kohli, for the first time, took over wicketkeeping duties during the team's first One Day International against Bangladesh here on Thursday.

ధోనీ స్థానాన్ని కోహ్లీ క్రమక్రమంగా లాగేసుకుంటున్నాడా?

Posted: 06/19/2015 12:22 PM IST
Virat kohli keeps wickets to give ms dhoni a one over break

టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ గా పూర్తి బాధ్యతలు చేపట్టిన విరాట్ కోహ్లీ... క్రమక్రమంగా ధోనీ స్థానాన్ని ఆక్రమించుకుంటున్నట్లుగా కనిపిస్తున్నాడు. ఇప్పటికే టెస్టు మ్యాచుల బాధ్యతల్ని తాను తీసుకుని కెప్టెన్ కూల్ ధోనీని కేవలం వన్డేలు, టీ20లకు మాత్రమే కోహ్లీ పరిమితం చేశాడు. ఇప్పుడు మరో విభాగంలోనూ కోహ్లీ తలదూర్చేసి.. ధోనికి మరింత తలనొప్పి తెచ్చిపెట్టినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏ విభాగంలో అనుకుంటున్నారా..? ధోనీకి జట్టులో స్థానం కల్పించిన ‘కీపింగ్’ విభాగం.

ఒకప్పుడు ఇండియా జట్టులో ప్రతిభావంతుడైన కీపర్ లేని సమయంలో ధోనీ ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుకున్నాడు. అదే అతనిని కెప్టెన్ గా ఎదిగేలా చేసింది. అటువంటి ‘కీపింగ్’ స్థానంపై కోహ్లీ కన్నేశాడని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. బంగ్లాదేశ్, టీమిండియా జట్టు మధ్య మీర్పూర్ లో వన్డే మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే! ఈ మ్యాచ్ లో ఇండియా భారీ ఓటమి పాలైన విషయాన్ని కాస్త పక్కన పెడితే.. కోహ్లీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. మ్యాచ్ జరుగుతుండగా ధోనీ 44వ ఓవర్ లో తన కీపింగ్ బాధ్యతలు వదిలేసి మైదానం వీడాడు. అప్పుడు కోహ్లీ కీపింగ్ గ్లౌవ్స్ లోకి దూరిపోయాడు. ఓ ఓవర్ పాటు కీపింగ్ చేశాడు. కీపింగ్ లో అంతగా అనుభవం లేకపోయినా.. బాగానే చేశాడు. అయితే.. 45వ ఓవర్ లో తిరిగి ధోనీ రావడంతో కోహ్లీ ఫీల్డింగ్ లోకి మారాడు.

ఇలా కోహ్లీ ఓ ఓవర్ పాటు కీపింగ్ చేయడంపైనే ప్రస్తుతం క్రికెట్ రంగంలో రచ్చరచ్చ జరుగుతోంది. టెస్టు కెప్టెన్ బాధ్యతల్ని ధోనీ నుంచి లాగేసుకున్న కోహ్లీ.. ఇప్పుడు వికెట్ కీపింగ్ ను కూడా లాగేసుకునే పనిలో పడ్డాడనే సందేహాలు వెలువడుతున్నాయి. అయితే.. ఓ ఓవర్ పాటు ధోనీ మైదానం వీడటంతోనే కోహ్లీ కీపింగ్ బాధ్యతల్ని చేపట్టాడే తప్ప.. ధోనీ నుంచి ‘కీపింగ్’ లాగేసుకోవడానికి కాదని క్రికెట్ ప్రముఖులు చెప్పుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  mahendra singh dhoni  bangladesh india match  

Other Articles