Indian Cricket Team to Tour Bangladesh in June

Indian cricket team to tour bangladesh

BCCI, Indian cricket team, Bangladesh cricket team, Test match, ODIs, india, bangladesh, series, cricket, team india bangla tour, Mirpur Gets Odis, Fatullah To Host India Test

India will play one Test and three ODIs against Bangladesh starting from June 10.

టీమిండియా బంగ్లాదేశ్ పర్యటన ఖరారు

Posted: 05/05/2015 08:48 PM IST
Indian cricket team to tour bangladesh

ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో అస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో పేలవ ప్రదర్శనతో తిరుగుముఖం పట్టిన టీమిండియా.. వరల్డ్ కప్‌ తర్వాత తొలి అంతర్జాతీయ పర్యటనకు సిద్ధమైంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమిండియా బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్‌తో ఒక టెస్టు, 3 వన్డే పోటీల్లో ఆడుతుంది. ఐపీఎల్ లో పూర్తిగా నిమగ్నమైన టీమిండియా జట్టు క్రికెటర్లు.. అది ముగిసిన రెండు వారాల గ్యాప్ లోనే బంగ్లాతో తలపడేందుకు బయలుదేరి వెళ్లనున్నారు.
 
పాకిస్థాన్ తో జరిగిన సీరీస్ లో నువ్వా నేనా అన్న రీతిలో తలపడి.. తొలి వన్డేలో పాక్ ను చిత్తు చేసిన బంగ్లా రెట్టించిన ఉత్సాహంతో.. భారత్ తో తలపడేందుకు సిద్దంగా వుంది. బంగ్లా టూర్ కోసం టీమిండియా జూన్ 7న బయల్దేరి వెళ్లనుంది. జూన్ పదిన బదుల్లాలో టెస్టు మ్యాచ్ కు సిద్దం కానుంది తొమ్మిదేళ్ల తర్వాత ఇక్కడ టెస్టు పోటీ జరుగనుంది. టెస్టు ముందు భారత్ వార్మప్ మ్యాచ్‌లు ఆడుతుంది. జూన్ 18, 21, 24 తేదీల్లో వన్డే మ్యాచ్‌లుంటాయి. మిర్పూర్‌లోనే 3 వన్డేలు జరుగుతాయని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తెలిపింది. జూన్ 26తో బంగ్లాదేశ్‌లో భారత్ టూర్ ముగుస్తుంది. ఇకపోతే.. జూలైలో-ఆగస్టులో దక్షిణాఫ్రికా బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది.

భారతదేశం పర్యటన పూర్తి షెడ్యూల్:

* జూన్ 7: టీం భారతదేశం బంగ్లాదేశ్ పయనం
* జూన్ 8, 9: ప్రాక్టీస్
* జూన్ 10-14: 1st టెస్ట్ మ్యాచ్
* జూన్ 15, 16 మరియు 17: ప్రాక్టీస్
* జూన్ 18: 1st ODI (జూన్ 19 రిజర్వ్ రోజు)
* జూన్ 20: ప్రాక్టీస్
* జూన్ 21: 2 వ ODI (జూన్ 22 రిజర్వ్ రోజు)
* జూన్ 23: ప్రాక్టీస్
* జూన్ 24: 3rd వన్డే (జూన్ 25 రిజర్వ్ రోజు)
* జూన్ 26: టీమిండియా స్వదేశానికి ఆగమనం

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  bangladesh  series  cricket  

Other Articles