Jonathan Trott: England batsman retires from international cricket

Trott retires from international cricket

Trott retires from international cricket, jonathan trott, england, cricket, west indies vs england 2015, England Cricket, retirement, international cricket, England batsman Jonathan Trott

England batsman Jonathan Trott announced his retirement from international cricket

అంతర్జాతీయ క్రికెట్ నుంచి ట్రాట్ గుడ్ బై

Posted: 05/05/2015 08:46 PM IST
Trott retires from international cricket

క్రికెట్ క్రీడకు పుట్టినిల్లుగా ఖ్యాతి గడించిన ఇంగ్లాండ్.. ఇటీవలి జరిగిన ప్రపంచ కప్ ఘోర వైఫల్యం మూటగట్టుకోవడంతో.. విమర్శలు వెల్లివిరుస్తున్నాయి. ఈ తరుణంలో సీనియర్ ఆటగాళ్లు జట్టుకు దూరమవుతున్నారు. తాజాగా బ్యాట్స్మన్ జోనాథన్ ట్రాట్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. ప్రపంచ క్రికెట్ అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్టు ట్రాట్ ప్రకటించాడు.

సుదీర్ఘ విరామం తర్వాత ఇంగ్లండ్ జట్టులోకి వచ్చిన ట్రాట్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. వెస్టిండీస్తో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్లో విఫలమయ్యాడు. ఇంగ్లండ్కు ప్రాతినిధ్యం వహించగల స్థాయిలో తన ఆటతీరులేదని, బాధాకరమైనా వైదొలగక తప్పలేదని ట్రాట్ చెప్పినట్టు ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. 34 ఏళ్ల ట్రాట్  52 టెస్టుల్లో 3835 పరుగులు చేశాడు. 68 వన్డేలాడిన ఇంగ్లండ్ క్రికెటర్ 2819 పరుగులు చేశాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jonathan Trott  England Cricket  retirement  

Other Articles