Australia bundled out for 151

australia, newzeland, worldcup2015, pool a

New Zealand pace bowler Trent Boult destroyed a powerful Australia batting lineup with an astonishing display of left-arm swing bowling in the cricket World Cup Pool A match at Eden Park on Saturday.Boult captured five wickets for one run during his second spell to help reduce Australia to 151 all out from 32.2 overs before a noisy capacity crowd of 40,000 on a glorious summer's day.

ఆస్ట్రేలియాను కట్టడి చేసిన న్యుజిలాండ్.. 151 పరుగులకే ప్యాకప్

Posted: 02/28/2015 09:55 AM IST
Australia bundled out for 151

వరల్డ్ కప్ లో హాట్ ఫేవరెట్ లుగా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా, న్యుజిలాండ్ ల మధ్య పోరు రసవత్తరంగా సాగింది. ముందు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆటగాళ్లను కట్టడి చెయ్యడంలో న్యుజిలాండ్ బౌలర్లు సఫలమయ్యారు. ఆరంభం నుండి ఆస్ట్రేలియా ఆటగాళ్లు తడబడ్డారు. దాంతో న్యుజిలాండ్ ఆస్ట్రేలియా స్కోర్ పెరగకుండా అడ్డుకట్ట వేసింది. ఓ దశలో 120 పరుగులకే ఆస్ట్రేలియా చేతులెత్తేస్తుందని అందరూ అనుకున్నా, ఎలాగోలా 151 పరుగులకు చేరింది. ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ లు ఎవరూ ఈ మ్యాచ్ లో రాణించడకపోవడం ఆస్ట్రేలియా ఘోరపతనానికి కారణమైంది. పూల్ ఎ లో మొదటి స్థానంలో ఉన్న న్యుజిలాండ్, రెండవ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో తలపడుతోంది.

డేవిడ్ వార్నర్ మినహా  ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎవరూ కూడా తమ బ్యాట్ లకు పని చెప్పలేకపోయారు. డేవిడ్ వార్నర్ 34 పరుగులతో ఆసట్రేలియా పరువుపోకుండా కాపాడాడు. షేన్ వాట్సన్ 23,  , ఆరోన్ ఫించ్ 14 పరుగులు చేశారు. 100 పరుగులలోపే ఆసీస్ ఆరు ప్రధాన వికెట్లను కోల్పోయింది.  97 పరుగులకే ఆసీస్ ఆరు వికెట్లను నష్టపోవడంతో ఒక్కసారిగి జట్టులో ఆందోళన ప్రారంభమయ్యింది.బ్యాంటింగ్ దిగిన కొద్ది సమయానికే ఆస్ట్రేలియా ఆటగాళ్లు టపటపా తమ వికెట్లను కోల్పోయారు.  న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ, వెటోరీ, బౌల్ట్ తలా రెండు వికెట్లు తీశారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : australia  newzeland  worldcup2015  pool a  

Other Articles