India record world cup 2015 south africa team

india cricket team, india cricket team records, india vs south africa, south africa world cup score, south africa high score, de villiers

india record world cup 2015 south africa team : India cricket team is in the first position for doing highest score in world cup 2007 which is not yet beaten by any other team.

సౌతాఫ్రికా 408 స్కోరు చేసినా.. రికార్డు మాత్రం భారత్ దే!

Posted: 02/27/2015 04:20 PM IST
India record world cup 2015 south africa team

ప్రపంచకప్ టోర్నమెంట్ లో భాగంగా సిడ్నీలో వెస్టిండీస్ జట్టుపై దక్షిణాఫ్రికా జట్టు 408 పరుగుల భారీ స్కోరుతో విజృంభించింది. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా జట్టు కెప్టెన్ అయిన డివిలియర్స్ విరుచుకుపడి కేవలం 66 బంతుల్లోనే 162 పరుగులు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న ఈ వరల్డ్ కప్ టోర్నమెంట్ లో ఇదే అత్యధిక స్కోరు! అయితే.. ఆ జట్టు అంత భారీ స్కోరు నమోదు చేసినప్పటికీ... ఇండియా రికార్డును మాత్రం బద్దలుకొట్టలేకపోయింది. ఇప్పటికీ వరల్డ్ కప్ లో అత్యధిక పరుగుల రికార్డు భారత్ పేరిటే వుంది.

2007లో జరిగిన ప్రపంచకప్ లో భాగంగా బెర్ముడా జట్టుపై టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 413 పరుగులు చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ రికార్డు పదిలంగానే వుంది. 2011 ప్రపంచకప్ లోనూ ఏ జట్టు ఇంత భారీ స్కోరును నమోదు చేయలేకపోయింది. ఇప్పుడు 2015లో దక్షిణాఫ్రికా ఆ రికార్డుకు చేరువలో వచ్చింది కానీ.. దాన్ని అధిగమించలేకపోయింది. మరి.. ఈ వరల్డ్ కప్ లోనైనా భారత్ రికార్డును ఏ జట్టైనా బద్దలుకొడుతుందో లేదో వేచి చూడాల్సిందే! అన్నట్లు.. వరల్డ్ కప్ పోటీలలో అత్యధిక విన్నింగ్ మార్జిన్ (257 పరుగులు, బెర్ముడాపై) ఇండియా పేరిటే వుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india cricket team records  south africa world cup records  

Other Articles