Rafael Nadal vows to bounce back from Wimbledon defeat to Dustin Brown

Nadal fears his best wimbledon days may be over

Wimbledon 2015: Nadal upset by Brown, Rafael Nadal, International, tennis, Wimbledon, Rafael Nadal, Dustin Brown, sports, Spanish professional tennis player nadal, wisports, cooking, Nadal, a good cook too, sachin tendulkar, wimbledon open 2015, king of clay, Brazil player ‘Dustin Brown, Brazil player ‘Thomas Bellucci’, social networking site

Spanish tennis ace Rafael Nadal says he may not be able to return to his heydays in Wimbledon after he was knocked out from the competition in the second round by German qualifier Dustin Brown.

మళ్లీ గత వైభవాన్ని చూస్తానో.. లేదో

Posted: 07/04/2015 03:55 PM IST
Nadal fears his best wimbledon days may be over

ఇంగ్లాండ్ వేదికగా అత్యంత ఉత్కంఠగా సాగుతున్న వింబుల్డన్‌ టోర్నమెంట్‌ 2015లో.. ఎక్కడో వందవ ర్యాంకు దాటిన కుర్రాడి చేతిలో ఓటమి పాలవ్వడంతో.. 14 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచి అమొఘమైన రికార్డు కలిగిన స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ తీవ్రంగా కలత చెందారు. తన ఆట తీరుపై తనకే నమ్మకం సన్నగిల్లుతందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. తాను మునుపటి ఫామ్ ను తిరిగి చేజిక్కించుకోవడం చాలా కష్టసాధ్యంగా మారిందని నిర్మోహమాటంగా తన మనసులోని మాటను వెలిబుచ్చాడు.

102 ర్యాంకులో కొనసాగుతున్న జర్మనీ యువ ఆటగాడు డుస్టిన్ బ్రౌన్ చేతిలో ఓటమిపాలవ్వడంతో ప్రఖ్యాత వింబుల్డన్ టోర్నమెంటు నుంచి నాదల్ రెండో రౌండ్ లోనే నిష్ర్కమించాల్సి వచ్చింది. దీంతో ఆయన ఆటతీరుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో స్వయంగా ఆయనే తాను గతంలో కొనసాగించిన అధ్వితీయమైన ఆటను మరోసారి చూడలేనేమోనని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను 2006, 2007, 2008లలో అద్భతమైన విజయాలను పొంత చేసుకున్నాను. ఆ స్థాయి అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇప్పటికే వింబుల్డన్ లో ఐదుసార్లు ఫైనల్ చేరి.. రెండు పర్యాయాలు టైటిల్ ను అందుకున్నానని కూడా చెప్పిన తాను.. మళ్లీ అంతటి పూర్వ వైభవం వస్తుందో లేదో తెలియడం లేదని, కాకాపోతే అందుకోసం శ్రమిస్తానని చెప్పుకోచ్చాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tennis  Wimbledon  Rafael Nadal  Dustin Brown  sports  

Other Articles