నల్ల కలువ .. సై.. సై అంటూ.. దూబాయ్ ఓపెన్ కు సిద్దమవుతుంది. ఒక పక్క పెరుగుతున్న వయసును పట్టించుకోకుండా టెన్నిస్ కెరీర్‌ను కొనసాగించాలన్న పట్టుదలతో ఉన్న ప్రపంచ నంబర్‌వన్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ సోమవారం నుంచి ప్రారంభమయ్యే దుబాయ్ ఓపెన్‌కు సిద్ధమైంది.
33 ఏళ్ల వయసులో మహిళలు టెన్నిస్‌ను ఏలడం, విజయాలు సాధించడం అరుదు. అయితే, సెరెనా గత ఏడాది అద్భుత ప్రతిభ కనబరచింది. అయితే, గత నెల జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో గాయం కారణంగా ఆమె పోరాటం చివరి వరకూ కొనసాగలేదు.
ఈ సమస్యను అధిగమించి మళ్లీ తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి దుబాయ్ ఓపెన్‌ను ఆమె వేదికగా మార్చుకుంది. అయితే, గాయాల నుంచి ఆమె పూర్తిగా కోలుకుందా లేదా అన్నది ఇంకా అనుమానంగానే ఉంది. ఈ వయసులో కాలి గాయాలు లేదా వెన్నునొప్పి మొదలైతే, సులభంగా తగ్గే అవకాశం లేదు.
సెరెనా ఈ అడ్డంకిని ఏ విధంగా అధిగమిస్తుందో చూడాలి. పైగా, 2009 నుంచి ఇప్పటి వరకూ దుబాయ్ ఓపెన్‌లో మూడు పర్యాయాలు ఆడినప్పటికీ ఒక్కసారి కూడా టైటిల్ గెల్చుకోలేకపోయింది. నాలుగో ప్రయత్నంలో ఆమె సఫలమవుతుందో లేదో చూడాలి.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Feb 26 | రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవా ఆటకు గుడ్‌బై చెప్పారు. క్రీడా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ స్టార్ ప్లేయర్.. ఇవాళ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మేరకు... ‘‘28 ఏళ్ల తర్వాత..... Read more
Aug 27 | 20 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత, ప్రపంచ మాజీ నెంబర్‌వన్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు యూఎస్ ఓపెన్‌లో ఊహించని షాక్ తగిలింది. అయితే వెంటనే కొలుకున్నాడు కానీ.. తొలి సెట్ మాదిరిగానే మిగతా మ్యాచ్... Read more
Sep 10 | యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో ఓడిమిని చవిచూడటంతో.. అంపైర్ పై విరుచుకుపడిన అమెరికా క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ పై టోర్నమెంట్ రిఫరీ కార్యాలయం భారీ జరిమానా విధించిన నేపథ్యంలో అమె చేసిన... Read more
Jul 10 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) క్రికెట్ లో అద్భుతమైన ఆట కనబర్చిన క్రికెటర్లకు ర్యాంకులు కేటాయించే విషయం ప్రతీ క్రికెట్ అభిమానికి తెలిసిందే అయితే తాజాగా ఐసీసీ ఓ టెన్నిస్ సూపర్ స్టార్ కి టెస్టుల్లో... Read more
Apr 13 | పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడి ఎనమిది వసంతాలు పూర్తి చేసుకున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ఓ వ్యక్తి నీ దేశం ఏదీ అంటూ ప్రశ్నించి.. అమె అగ్రహానికి గురయ్యాడు. అంతేకాదు... Read more