శ్రీరాజరాజేశ్వరి దేవి అవతారంలో కనకదుర్గమ్మ | Kanakadurgamma as sri raja rajeswari devi

Sri raja rajeswari devi in durga navaratrulu

sri raja rajeswari devi in saranavaratrulu, sri raja rajeswari devi in saranavaratrulu, Kanakadurgamma as sri raja rajeswari devi, sri raja rajeswari devi Avatar, sri raja rajeswari devi history

Kanakadurgamma as sri raja rajeswari devi in saranavaratrulu.

శరన్నవరాత్రులు పదకొండవ రోజు శ్రీరాజరాజేశ్వరి దేవి

Posted: 10/08/2016 11:26 AM IST
Sri raja rajeswari devi in durga navaratrulu

శరన్నవరాత్రి ఉత్సవములలో కనక దుర్గమ్మ వారి అలంకారములలో చివరి రూపము శ్రీ రాజ రాజేశ్వరీ దేవి. సకల భువన బ్రహ్మాండాలకు అమ్మ ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయములో పూజలందుకుంటుంది.

శ్రీ రాజరాజేశ్వర్యష్టకమ్

అమ్బా శామ్భవి చన్ద్రమౌళిరబలా పర్ణా ఉమా పార్వతీ
కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ
సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

అమ్బా మోహిని దేవతా త్రిభువనీ ఆనన్దదాయినీ
వాణీ పల్లవపాణివేణుమురళీగానప్రియా లోలినీ
కల్యాణీ ఉడురాజబిమ్బ వదనా ధూమ్రాక్షసంహారిణీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

అమ్బా నూపురరత్నకఙ్కణధరీ కేయూరహారావళీ
జాతీచమృకవైజయంతిలహరీ గ్రైవేయకైరాజితా
వీణావేణు వినోదమణ్డితకరా వీరాసనే సంస్థితా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

అమ్బా రౌద్రిణి భద్రకాళి బగళా జ్వాలాముఖీ వైష్ణవీ
బ్రహ్మణీ త్రిపురాన్తకీ సురనుతా దేదీప్యమానోజ్వలా
చాముణ్డా శ్రితరక్షపోషజననీ దాక్షాయణీ వల్లవీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

అమ్బా శూలధనుః కశాఙ్కశధరీ అర్థేన్దుబిమ్బాధరీ
వారాహీమధుకైటభప్రశమనీ వాణీ రమా సేవితా
మల్లద్యాసురమూకదైత్యమథనీ మహేశ్వరీ చామ్బికా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

అమ్బా సృష్టవినాశపాలనకరీ ఆర్యా విసంశోభితా
గాయత్రీ ప్రణవాక్షరామృతరసః పూర్ణానుసంధీ కృతా
ఓఙ్కారీ వినతాసుతార్చితపదా ఉద్దణ్డ దైత్యాపహా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

అమ్బా శాశ్వత ఆగమాదివినుతా ఆర్యా మహాదేవతా
యా బ్రహ్మాదిపిపీలికాన్తజననీ యా వై జగన్మోహినీ
యా పంచప్రణవాదిరేఫజననీ యా చిత్కళా మాలినీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

అమ్బా పాలితభక్తరాజదనిశం అమ్బాష్టకం యః పఠేత్
అమ్బాలోలకటాక్షవీక్ష లలితం చైశ్వర్యమవ్యాహతమ్
అమ్బా పావనమన్త్రరాజపఠనాదన్తే చ మోక్షప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

~ ఇతి శ్రీరాజరాజేశ్వర్యష్టకం సమ్పూర్ణమ్ ~


ఆమ్మను అపరాజితాదేవిగా కూడా భక్తులు పూజించే ఆచారము ఉన్నది. ఈమె స్వప్రాకాశ జ్యోతి స్వరూపిణి. పరమేశ్వరుని అంకము అమ్మకు ఆసనము. ఇఛ్ఛా, ఙ్ఞాన, క్రియా శక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరములుగా అనుగ్రహిస్తుంది. ఆమ్మ యోగమూర్తి. మాయా మోహిత మానవ మనోచైతన్యాన్ని రాజరాజేశ్వరీ దేవి ఉద్దెపితం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రమునకు అమ్మ అథిష్టాన దేవత.

పచ్చరంగు చీరతో లలితా సహస్రనామము పారాయణము చేయవలెను. కుంకుమార్చన చేయవలెను. సువాసినీ పూజ చేయవలెను. శ్రీచక్రార్చన ఉత్తమమైనది. లడ్డూలు నివేదన చెయ్యాలి. శ్రీ రాజరాజేశ్వర్యష్టకమ్ తోపాటు అష్టోత్తరశత నామావళీ పఠించాలి.  


శ్రీ రాజరాజేశ్వరీ అష్టోత్తరశత నామావళీ

ఓం శ్రీభువనేశ్వర్యై నమః
ఓం రాజేశ్వర్యై నమః
ఓం రాజరాజేశ్వర్యై నమః
ఓం కామేశ్వర్యై నమః
ఓం బాలాత్రిపుర సున్దర్యై నమః
ఓం సర్వైశ్వర్యై నమః
ఓం కల్యాణైశ్వర్యై నమః
ఓం సర్వసంక్షోభిణ్యై నమః
ఓం సర్వలోక శరీరిణ్యై నమః
ఓం సౌగన్ధికమిళద్వేష్ట్యై నమః    
ఓం మన్త్రిణ్యై నమః
ఓం మన్త్రరూపిణ్యై నమః
ఓం ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం ఆదిత్యై నమః
ఓం సౌభాగ్యవత్యై నమః
ఓం పద్మావత్యై నమః
ఓం భగవత్యై నమః
ఓం శ్రీమత్యై నమః
ఓం సత్యవత్యై నమః    
ఓం ప్రియకృత్యై నమః
ఓం మాయాయై నమః
ఓం సర్వమఙ్గళాయై నమః
ఓం సర్వలోకమోహనాధీశాన్యై నమః
ఓం కిఙ్కరీభూతగీర్వాణ్యై నమః
ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః
ఓం పురాణాగమరూపిణ్యై నమః
ఓం పఞ్చప్రణవరూపిణ్యై నమః
ఓం సర్వగ్రహరూపిణ్యై నమః
ఓం రక్తగన్ధకస్తూరి విలేపన్యై నమః    
ఓం నానాయై నమః
ఓం శరణ్యాయై నమః
ఓం నిఖిలవిద్యేశ్వర్యై నమః
ఓం జనేశ్వర్యై నమః
ఓం భూతేశ్వర్యై నమః
ఓం సర్వసాక్షిణ్యై నమః
ఓం క్షేమకారిణ్యై నమః
ఓం పుణ్యాయై నమః
ఓం సర్వరక్షణ్యై నమః
ఓం సకలధర్మిణ్యై నమః    
ఓం విశ్వకర్మిణ్యై నమః
ఓం సురముని దేవనుతాయై నమః
ఓం సర్వలోకారాధ్యాయై నమః
ఓం పద్మాసనాసీనాయై నమః
ఓం యోగీశ్వరమనోధ్యేయాయై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం సర్వార్థసాధనాధీశాయై నమః
ఓం పూర్వాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం పరమానన్దాయై నమః    
ఓం కళాయై నమః
ఓం అనగాయై నమః
ఓం వసున్ధరాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః
ఓం పీతాంబరధరాయై నమః
ఓం అనన్తాయై నమః
ఓం భక్తవత్సలాయై నమః
ఓం పాదపద్మాయై నమః
ఓం జగత్కారిణ్యై నమః    60
ఓం అవ్యయాయై నమః
ఓం లీలామానుషవిగ్రహాయై నమః
ఓం సర్వమాయాయై నమః
ఓం మృత్యుఞ్జయాయై నమః
ఓం కోటిసూర్యసమప్రభాయై నమః
ఓం పవిత్రాయై నమః
ఓం ప్రాణదాయై నమః
ఓం విమలాయై నమః
ఓం మహాభూషాయై నమః
ఓం సర్వభూతహితప్రదాయై నమః    
ఓం పద్మాలయాయై నమః
ఓం సుధాయై నమః
ఓం స్వఙ్గాయై నమః
ఓం పద్మరాగకిరీటిన్యై నమః
ఓం సర్వపాప వినాశిన్యై నమః
ఓం సకలసంపత్ప్రదాయిన్యై నమః
ఓం పద్మగన్ధిన్యై నమః
ఓం సర్వవిఘ్నకేశధ్వంసిన్యై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం విశ్వమూర్త్యై నమః    
ఓం అగ్నికల్పాయై నమః
ఓం పుణ్డరీకాక్షిణ్యై నమః
ఓం మహాశక్త్యై నమః
ఓం బుద్ధాయై నమః
ఓం భూతేశ్వర్యై నమః
ఓం అదృశ్యాయై నమః
ఓం శుభేక్షణాయై నమః
ఓం సర్వదర్శిణ్యై నమః
ఓం ప్రాణాయై నమః
ఓం శ్రేష్ఠాయై నమః    
ఓం శాన్తాయై నమః
ఓం తత్త్వాయై నమః
ఓం సర్వజనన్యై నమః
ఓం సర్వలోక వాసిన్యై నమః
ఓం కైవల్యరేఖావళ్యై నమః
ఓం భక్తపోషణవినోదిన్యై నమః
ఓం దారిద్రనాశిన్యై నమః
ఓం సర్వోపద్రవారిణ్యై నమః
ఓం సంహృదానన్దలహర్యై నమః
ఓం చతుర్దశాన్త కోణస్థాయై నమః    
ఓం సర్వాత్మాయై నమః
ఓం సత్యవక్త్ర్యై నమః
ఓం న్యాయాయై నమః
ఓం ధనధాన్యనిధ్యై నమః
ఓం కాయకృత్యై నమః
ఓం అనన్తజిత్యై నమః
ఓం స్థిరాయై నమః    

ఆఖరి రోజు అమ్మ అవతారం ముగిశాక. శ్రీదేవీ దణ్ణకంతో శరన్నవరాత్రులు ఘనంగా ముగుస్తాయి. విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి

శ్లో ! శమీ శమయతే పాపం శమీశతృవినాశినీ !
అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ !!

అను శ్లోకమును స్మరిస్తూ ప్రదక్షిణ చేసి ఆ శ్లోకం వ్రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటుగా శనిదోష నివారణ కూడా పొందుతారని ప్రతీతి. ఇలా మానవులను మానవులుగా తీర్చిదిద్ది, మ అనగా మాయ, న అంటే లేకుండా, వ అంటే వర్తింప చేసే తల్లిగా లాలించి, తండ్రిగా పోషించి, గురువుగా ప్రపంచ విలువలను చాటి చెప్పే శక్తి ఆ జగన్మాతకే సాధ్యం.

అసాధ్యాలను సుసాధ్యాలుగా చేయాలన్నా మనకు ఏర్పడిన సర్వ దుఃఖాల నుండి ఉపశమనం పొందాలన్నా దారిద్రం తొలగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో ఇహలోక పరలోక సుఖాలను పొందుటకై ఈదేవి నవరాత్రుల యందు ఆదేవదేవికి పూజలతోపాటు ఖడ్గమాల స్తోత్రం, శ్రీలలితా సహస్రనామ పారాయణ నిత్యమూ గావించి ఆ జగన్మాత కృపాకటాక్ష వీక్షణలు మనమంతా పొందుదాము.

శ్రీ దేవీ దణ్డకము
నమస్తే నమస్తే నమస్తే నమో దేవీ! విశ్వేశ్వరి! ప్రాణనాథే! సదానన్దరూపే! సురానన్దదే! తే నమో దానవాన్తప్రదే! మానవానాఘనేకార్థదే! భక్తిగమ్యస్వరూపే! న నామ్నాం హి సఙ్ఖ్యాం నతే రూప మీ దృక్తయా కోషివేదాఽఽ రూపేత్వమేవాసి సర్వేషు దేవేషు శక్తిః ప్రజాసృష్టి సంహారకాలే సదైవ స్మృతి స్త్వం ధృతి స్త్వం త్వమేవాసి బుద్ధి ర్జరా పుష్టిమేధే ధృతిః కాన్తి శాన్తీ చ విద్యా చ లక్ష్మీర్గతిః కీర్తిసఞ్జ్ఞే త్వ మే వాసి విశ్వస్య బీజం పురాణం యదా యై స్స్వరూపైః కరోషీహ కార్యం సురాణాం చ తేభ్యో నమో మోద్య శాన్త్యై క్షమాయోగనిద్రా దయా త్వం వివక్షా స్థితా సర్వభూతేషు శస్తై స్స్వరూపైః కృతమ్‌ కార్య మాదౌ త్వయా యత్సురాణాం హతోఽసౌ మహారి ద్మదాన్ధో హయారి ర్దయా తే సదా దేవవర్గేషు దేవి! ప్రసిద్ధా పురాణేషు వేదేషు గీతా కిమత్రాస్తి చిత్రమ్‌ యదంబా సుతాన్‌ స్వాన్‌ ముదా పాలయే త్తోషయే త్సమ్య గేవ ప్రధానం న కిం త్వం జనిత్రీ సురాణాం సహాయా కురుష్వే కచిత్తేన కార్యం సమగ్రం నతే చ స్తుతీనా మియత్తాం స్వరూపం వయం దేవి జానీమహే విశ్వవన్ద్యే! కృపాపాత్ర మిత్యేవ మత్వా తథాస్మాన్‌ భయేభ్య స్సదా పాహి పాతుం సమర్థే? వినాబాణపాతైర్వినా వజ్రఘాతైర్వినా శూలఖడ్గైర్వినా శక్తిదణ్డై రిపూన్‌ హన్తుమేవాసి శక్తావినోదా ద్వయం విద్మదేవి! త్వదీయం చరిత్రం వరం శాశ్వతం యే వదన్తీహ మూఢా న కార్యం వినా కారణం సంభవేద్వా ప్రసిద్ధ్యా వయం కల్పయామోనుమానం ప్రమాణం త్వమే వాసి విశ్వస్య మాతా తదానీ మజ స్సృష్టికర్తా హరిః పాలకో వై హరో నాశకృద్వై ప్రసిద్ధాః పురాణైర్న కిం త్వ త్ప్రసూతాస్త ఏతే యుగాదౌత్వ మేవాసి సర్వస్య తేనైవ మాతా త్రిభిస్త్వం పురారాధితా దేవి! దత్తాత్వయా శక్తిరుగ్రా తేభ్య స్సమగ్రా తయా సంయుతా స్తే ప్రకుర్వన్తి మాత! ర్జగత్పాలనోత్పత్తి సంహార చైవం విధాపీహ నః పాతు మార్యే! కిమర్థం విలంబః? పరై ర్వఞ్చితా స్స్మోవయం పాహి నః పాహి నః పాహి దేవి!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sri raja rajeswari devi  Kanakadurgamma  saranavaratrulu  

Other Articles

  • Ramayanam forty seven story

    రామాయణం-47వ-భాగం

    Sep 11 | శాంతించిన రాముడితో లక్ష్మణుడు " అన్నయ్యా! చూశావ లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో... Read more

  • Ramayanam forty six story

    రామాయణం-46వ-భాగం

    Sep 07 | త్వయా ఏవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుం ఇచ్ఛతా | మమ అపవాహితో భర్తా మృగ రూపేణ మాయయా || రావణుడి చేత ఎత్తుకుపోబడుతున్న సీతమ్మ ఇలా అనింది " నువ్వు మాయా మృగాన్ని... Read more

  • Ramayanam forty five story

    రామాయణం-45వ-భాగం

    Sep 06 | అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు, లక్ష్మణుడు కంటికి కనపడనంత దూరానికి వెళ్ళాక, ఆ రథం నుండి కిందకి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలని ధరించి, ఒక పిలక పెట్టుకుని, యజ్ఞోపవీతం వేసుకుని,... Read more

  • Ramayanam forty four story

    రామాయణం-44వ-భాగం

    Sep 03 | రావణుడు, మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం దెగ్గర రథంలో దిగారు. అప్పుడా మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు. దాని ఒళ్ళంతా బంగారు రంగులో ఉంది, దానిమీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు... Read more

  • Ramayanam forty three story

    రామాయణం-43వ-భాగం

    Aug 27 | అందరూ వెళ్ళిపోయాక రావణుడు నిశ్శబ్ధంగా వాహనశాలకి వెళ్ళి సారధిని పిలిచి ఉత్తమమైన రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. అప్పుడు రావణుడు బంగారంతో చెయ్యబడ్డ, పిశాచాల వంటి ముఖాలు ఉన్న గాడిదలు కట్టిన రథాన్ని ఎక్కి సముద్ర... Read more