ఫిఫా వరల్డ్ కప్ లో అభిమానులు
ముఖ్యంగా ఈ ఆటలను వీక్షించుకోవడానికి మహిళా అభిమానులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వున్న మహిళా అభిమానులు ఈ ఆటలను వీక్షిస్తూనే అందాల ప్రదర్శనలు చేస్తున్నారు. తమ జట్టుకు మద్దతు తెలుపుతూ ఉత్సాహంగా ఉర్రూతలూగిపోతున్నారు. తమ ముఖాల మీద రంగులు వేసుకుని - తమ జట్టు జాతీయ జెండాని పట్టుకుని ఫోటోగ్రాఫర్ లకు పోజులిచ్చారు. యావత్ ప్రపంచవ్యాప్తంగా తమతమ దేశాల నుంచి వచ్చినవారు... తమ దేశం మీదున్న భక్తిని చూపిస్తూ రంగురంగుల హరివిల్లును కనువిందు చేసేలా కనిపించారు.ఈ విధంగా లక్షలాది మంది మహిళలు ఎన్నడూలేని విధంగా వీక్షించడానికి తరలిరావడంతో దీనిని అందరూ ‘‘గ్లామరస్ వరల్డ్ కప్’’గా పేర్కొంటున్నారు.
Picture Source : dailymail.co.ukAS