• masa
  • masa
Mesha Raasi

ఆదాయం : 14 ; రాజపూజ్యం : 4 ; వ్యయం : 2 ; అవమానం : 5

ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకునేముందు కుటుంబీకులతో పునరాలోచన చేసుకుంటే మంచిది. ఆదాయానికి మించి ఖర్చులు ఎక్కువగా వుండటం వల్ల ఆర్థికపరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కుంటారు. బంధుమిత్రులతో తగాదాలు ఏర్పడే అవకాశాలు వున్నాయి.

కొత్తగా వ్యాపారాలు నిర్వహిస్తున్నవారికి ఆటంకాలు, ఇబ్బందులు ఎదురయినప్పటికీ వాటిని అధిగమిస్తూ ముందుకు సాగిపోతారు. కాంట్రాక్టులు, ఏజేన్సీలవారికి అనుకూలం. కొత్తగా ఒప్పందాలు, డబ్బు పంపిణీ వ్యవహారాలు, చెక్కుల విషయాలలో ఏకాగ్రత ముఖ్యం. చేతివృత్తులు, చిరు వ్యాపారస్తులకు మంచి లాభాలు అందుతాయి. రియల్ ఎస్టేట్, బ్రోకర్లు, ఏజెంట్లకు ఆశాజనకంగా వుంటుంది. స్త్రీలు అన్ని రంగాలలో తమ ప్రతిభను చాటుకుంటారు. నిరుద్యోగులు కొన్ని పరిస్థితుల్లో జాగ్రత్తగా వుండాలి.

valuprma