ఈమధ్య బాలీవుడ్ లో అన్ని శుభవార్తలే వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీకి ఓ కూతురు పుట్టింది. ఆ కూతురుకు ‘అదిరా’ అనే పేరు కూడా పెట్టారు. ప్రస్తుతం రాణీముఖర్జీ దంపతులు సంతోషంగా వున్నారు. ఇదిలా వుంటే నిన్న సల్మాన్ ఖాన్ కోర్టు కేసు మొత్తానికి క్లియర్ అయిపోయింది. దీంతో బాలీవుడ్ జనాలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక తాజాగా జెనీలియా గురించి కూడా ఓ శుభవార్త వినిపిస్తోంది.
అదేంటంటే... ఒకప్పుడు టాలీవుడ్ లో ఎనర్జిటిక్ స్టార్ హీరోయిన్ గా భారీ క్రేజ్ ను దక్కించుకున్న జెనీలియా సినిమాలకు దూరంగా వుండి, బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఓ బాబు (రియాన్) జన్మించాడు. ఇటీవలే వీరి ముద్దుల కొడుకు రియాన్ మొదటి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
అయితే జెనీలియా మరోసారి తల్లికాబోతుందంటూ బాలీవుడ్ లో వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తలపై రితేష్ ఫ్యామిలీ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. మరి ఈ వార్తల్లో ఎలాంటి నిజం వుందో తెలియాలంటే మరికొంత కాలం వేచిచూడాల్సిందే. ప్రస్తుతం రితేష్ వరుస సినిమాలతో బిజీగా వుండగా, జెనీలియా మాత్రం తన కొడుకు రియాన్ తో సంతోషంగా ఎంజాయ్ చేస్తోంది.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more