తెలుగు, తమిళంలో ఎన్ని సినిమాల్లో నటించినప్పటికీ, అందాల ఆరబోత ప్రదర్శించినప్పటికీ రాని గుర్తింపు ఒక్క ‘ఐ’ సినిమాతో దక్కించుకుంది హీరోయిన్ అమీ జాక్సన్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఐ’ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఈ సినిమా తర్వాత అమీ జాక్సన్ కు వరుస సినీ ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సింగ్ ఈజ్ బ్లింగ్’ చిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. అలాగే తమిళంలో ధనుష్ సరసన ‘VIP2’ చిత్రంలో, ఉదయనిధి స్టాలిన్ సరసన మరో సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమాల తర్వాత విజయ్ హీరోగా నటించబోయే 59వ చిత్రంలో హీరోయిన్ అమీ జాక్సన్ కు అవకాశం వచ్చింది. అయితే తాజాగా యువ స్టార్ హీరో శివకార్తికేయన్ తో రొమాన్స్ చేసే అవకాశం దక్కించుకున్నట్లుగా తెలిసింది. ప్రస్తుతం శివకార్తికేయన్ వరుస హిట్ చిత్రాలతో దూసుకుపోతున్నాడు.
శివకార్తికేయన్ హీరోగా భాగ్యరాజ్ కన్నన్ తో ఓ సినిమా చేయనున్నాడు. 24 AVM స్టూడియోస్ బ్యానర్లో రాజా నిర్మించనున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా అమీ జాక్సన్ ను ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం, పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫిని అందించనున్నారు. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more