Manchu Vishnu To Do Hanuman Role In New Mythological Movie Which Is Based On Hanuma Real Life | Tollywood Gossips

Manchu vishnu hanuman role mythological telugu movies tollywood gossips

manchu vishnu, hanuman role, vishnu hanuman role, manchu vishnu updates, manchu vishnu gossips, manchu vishnu controversies, hanuman movies, hanuman high budget movie, dynamite movie

Manchu Vishnu Hanuman Role Mythological Telugu Movies Tollywood Gossips : Manchu Vishnu To Do Hanuman Role In New Mythological Movie Which Is Based On Hanuma Real Life.

‘సాంకేతిక హనుమంతుడు’గా మారనున్న విష్ణు

Posted: 08/29/2015 04:59 PM IST
Manchu vishnu hanuman role mythological telugu movies tollywood gossips

ఇండస్ట్రీలో నటీనటులుగా కొనసాగుతున్న వారందరికీ తమకంటూ కొన్ని డ్రీమ్ రోల్స్ వుంటాయి. తమ కెరీర్ లో ఒక్కసారైనా ఆ పాత్రల్లో నటించాలని ఉత్సుకత వారిలో వుంటుంది. అయితే.. అటువంటి కోరికలు ప్రతిఒక్కరికీ పూర్తి కావు. కేవలం కొద్దిమందికి మాత్రమే అవి సాకారమవుతాయి. అలాంటివారి జాబితాల్లో తాజాగా మంచి విష్ణు కూడా చేరనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ హీరో తన డ్రీమ్ రోల్ లో నటించనున్నట్లు సమాచారం.

‘డైనమైట్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు త్వరలోనే రానున్న విష్ణు.. ఆ తర్వాత పూర్తిస్థాయి పౌరాణిక చిత్రంలో నటించనున్నాడు. హనుమంతుడి జీవిత చరిత్రగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విష్ణు ప్రధాన పాత్రని పోషించనున్నాడని అంటున్నారు. హనుమంతుడి బాల్యం.. సమస్త దేవతల ఆశీస్సులు ఆయనకి లభించడం.. సీతారాముల సేవలో ఆయన తరించడం.. ఆ తరువాత హిమాలయాలకి వెళ్లడం వంటి ఘట్టాలను భక్తులు కనులముందు సాక్షాత్కరింపజేసుకుంటూ ఉంటారు. అలాంటి హనుమంతుడి జీవితచరిత్రను అంతర్జాతీయ సాంకేతిక నైపుణ్యంతో తెరకెక్కించనున్నట్టు చెబుతున్నారు. తెలుగుతోపాటు తమిళ, ఆంగ్ల భాషల్లో ఈ సినిమాను విడుదల చేసే ఉద్దేశంతో ఉన్నట్టుగా సమాచారం. ఈ సినిమాకి సంబంధించిన పూర్తివివరాలు తెలియాల్సి వుంది.

ఇదిలావుండగా.. గతంలో తనకు పౌరాణిక చిత్రాలంటే ఎంతో ఇష్టమని మంచు విష్ణు వెల్లడించిన సందర్భాలున్నాయి. అయితే.. ఆ తరహా సినిమాలను తెరకెక్కించడం భారీ బడ్జెట్టుతో కూడుకున్న పని కాబట్టి అప్పట్లో వీలు పడలేదు. కానీ.. ఇప్పుడు ‘బాహుబలి’ చిత్రం విడుదలైన తర్వాత ఆ తరహా చిత్రాలపైనే దర్శకనిర్మాతలు, నటీనటులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో హనుమంతుడి జీవత చరిత్ర ఆధారంగా ఓ పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా హనుమంతుడి పాత్రలో మంచు విష్ణు నటించే అవకాశం రావడంతో.. అతగాడు సంతోషంతో ఉప్పొంగుతున్నాడని అంటున్నారు. ఈ చిత్రంతో అతని డ్రీమ్ రోల్ కోరిక కూడా తీరనుందని చెప్పుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : manchu vishnu  Hanuman Movies  Dynamite Telugu Movie  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more