Rani mukherjee to play role of daud ibrahim sister haseena parkar role in her biography movie

rani mukherjee next movie, rani mukherjee in mardani movie, rani mukherjee as daud sister, rani mukherjee in hasina parker role, daud ibrahim family, hasina parker life, hasina parker biography movie, bollywood latest updates, tollywood latest updates, biography movies

rani mukherjee to play role of daud ibrahim sister Haseena Parkar role in her biography movie : bollyw0od daring actress rani mukharjee to act in hasina parker biography movie as daud sister but on this matter rani not told anything to film unit

షాకింగ్ : రాణి దావూద్ చెల్లి అట

Posted: 10/18/2014 11:43 AM IST
Rani mukherjee to play role of daud ibrahim sister haseena parkar role in her biography movie

అండర్ వరల్డ్ మాఫియా ఢాన్ దావూద్ ఇబ్రహీంకు హసీనా పార్కర్ అనే చెల్లి ఉందని.. ఆమె ముంబైని గడగడలాడించిందని తెలుసు. మూడు నెలల క్రితం చనిపోయిన ఈమె జీవితం ఆధారంగా ఓ సినిమా చేయాలని బాలీవుడ్ డైరెక్టర్ అపూర్వ లఖియా ప్లాన్ చేస్తున్నాడు. సినిమా చేసేందుకు హక్కుల కోసం డాన్ చెల్లి ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతున్నాడు. ఎలాగైనా హసీనా ఏమిటో అందరికి చూపించాలని కసిగా ఉన్న లఖియా.., ఇందుకోసం ఆమె ఇంట్లోవారిని ఒప్పించే పనిలో ఉన్నట్లు ఈ మద్య ఓ ఇంటర్య్వూలో చెప్పాడు.

ఇక ఈ ప్రాజెక్టు గురించి మరో ఆసక్తికర విషయం తెలుస్తోంది. దావూద్ చెల్లెలి క్యారెక్టర్ నటి రాణి ముఖర్జీ పోషిస్తుందట. బి టౌన్ లో డేరింగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు అయితేనే పార్కర్ పాత్రకు న్యాయం చేయగలదు అని డైరెక్టర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. హసీనా పార్కర్ మాటతీరు.. నడవడిక.., విధానం ఇతర ముఖ్య అంశాలను రాణి అయితే పూర్తిగా కవర్ చేయగలదు అని లఖియా భావిస్తున్నాడు. అందువల్లే ఆమెకు ఈ ఆఫర్ చేసినట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే ఢాన్ చెల్లి పాత్ర ఆఫర్ పై రాణి మాత్రం ఇంకా స్పందించలేదట. ఈ ఏడాది ‘మర్దాని’ అనే సినిమాలో డేరింగ్ పోలిస్ క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది ముఖర్జీ.

క్రియేటివ్ కధలు కాకుండా..,ప్రముఖుల జీవితాలను తెరకెక్కించి హిట్ కొట్టడం బాలీవుడ్ కు అలావాటుగా మారింది. ఆకోవలోనే ఈ బయోగ్రపీ మూవీకూడా తెరకెక్కితే బిగ్ హిట్ అవుతుందని బాలీవుడ్ ప్రముఖులు చెప్తున్నారు. దావూద్ ఇబ్రహీం చెల్లిగా... ముంబై లేడీ ఢాన్ గా హసీనా పార్కర్ అందరికి సుపరిచితురాలు. దావూద్ దేశం విడిచివెళ్లాక ఇక్కడి కార్యకలాపాలు ముంబైలో ఆమె చూసుకునేది. బెదిరింపులు, డబ్బులు వసూళ్ళు, దందాలు, సెటిల్ మెంట్లు, చివరకు రాజకీయ పార్టీల మద్య వివాదాలను కూడా పరిష్కరించేదని పేరు ఉంది. నగరంలో బిల్డింగులు కట్టాలంటే హసీనాకు డబ్బు ముట్టచెప్పాల్సిందే. సౌత్ ముంబైలో ఆమె అనుమతి లేకుండా పునాది పడిన భవనం ఒక్కటి కూడా లేదు అని అంతా చెప్తారు.

ముంబైలోని నాగపడలో నివసించిన హసీనా ఇళ్లు స్థానిక పోలిస్ స్టేషన్ ఎదురుగానే ఉండి.. నిత్యం వారి ముందే సెటిల్ మెంట్లు, ఇతర అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నా ఎవరూ అడ్డుకున్న దాఖలాలు లేవు. ఇలా ముంబైలో అక్రమ రాజ్యాన్ని ఏలిన హసీనా ఈ ఏడాది జులైలో గుండెపోటుతో కన్నుమూసింది. బ్రతికి ఉన్నప్పటినుంచే ఆమెజీవితం ఆధారంగా సినిమా చేయాలని అపూర్వ లఖియా భావించేవారు. అయితే పలు ఇబ్బందుల వల్ల అది ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదు.

కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rani mukherjee  hasina parker  daud ibrahim  bollywood  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more