Mahesh nag multi starrer with aish

Mahesh Nag multi starrer with Aish, Mahesh Babu Nagarjuna multi starrer movie, director mani ratnam

Mahesh Nag multi starrer with Aish

మహేష్ నాగ్ ఐష్ ల మల్టీ స్టారర్ మణిరత్నం దర్శకత్వంలో

Posted: 01/23/2014 09:55 AM IST
Mahesh nag multi starrer with aish

పాతదైనా బంగారం బంగారమే కదా.  ఇప్పటికీ సినిమా డైలాగ్ లలో నువ్వేమైనా ఐశ్వర్యా రాయ్ అనుకున్నావా అని అమ్మాయిని అనటం, నీ ముఖానికి ఐశ్వర్యా రాయ్ కావాలా అని అబ్బాయిని వెక్కిరించటం లాంటివి ఎన్నో వస్తున్నాయంటే ఐశ్వర్యా రాయ్ అందానికి మనవాళ్ళు కట్టిన వెల ఎంతో అర్థమౌతోంది.  అందుకు కారణం పాతబడ్డా తరగని బంగారం విలువే. 

ఒకప్పుడు విభిన్నమైన రీతిలో సినిమాలు తీసి సంచలనాన్ని సృష్టించిన మణిరత్నం కొంతకాలంగా మరుగునేవున్నారు.  అయినా ఆయనదీ పాత బంగారం విలువే సుమా.  అయితే మణిరత్నం తను సినిమా రంగాన్ని వదిలేసిన చోటనే ఆగిపోయినట్లుగా కనపడుతోంది.  అందుకే హీరోయిన్ గా ఐశ్వర్యారాయ్ నే ఎంచుకుంటున్నారు.  అది కూడా మహేబ్ బాబు, నాగార్జున సరసన.   ఇది భారీ యాక్షన్ సన్నివేశాలతో త్రిభాషా చిత్రంగా రూపొందించాలని ఆశపడుతున్నారాయన. 

ఐశ్వర్యారాయ్ ని ఒప్పించటం మణిరత్నానికి కష్టమేమీ కాకపోవచ్చు.  ఎందుకంటే ఆయన మీద నటీనటులందరికీ ఎనలేని అభిమానం ఉంది.  దానికి తోడు రెండవ సారి రంగప్రవేశం చెయ్యటానికి మణిరత్నం కంటే మంచి దర్శకుడు ఎవరు దొరుకుతారు. 

సామాన్యంగా పెళ్ళవగానే సినిమాలకు దూరమవుతుంటారు హీరోయిన్లు.  కానీ బిడ్డను కన్నతర్వాత కూడా ఆమెను హీరోయిన్ గా చూపించాలనుకునే తపన పడుతున్న మణిరత్నం ఆశ ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడవలసిందే! 

దర్శకరత్న దాసరి నారాయణ మాత్రం బాబీ సినిమా తర్వాత రాజేష్ ఖన్నాను పెళ్లాడి సినిమా రంగానికి దూరమైన డింపుల్ కపాడియాను ఒప్పించి హీరోయిన్ వేషం కట్టించినా అది బాక్స్ ఆఫీస్ దగ్గర బోర్లాపడింది.  దాని పేరు జఖ్మి షేర్.  1973 లో విడుదలైన రాజ్ కపూర్ సినిమా బాబీ తర్వాత 1984 లో జఖ్మి షేర్ తో తిరిగి సినిరంగ ప్రవేశం చేసింది డింపుల్ కపాడియా. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more