Raveena tandons kiddy film dream comes true

Raveena Tandon's kiddy film dream comes true, Raveena Tandon, Hot and Sexy Raveena Tandon Wallpaper,

Raveena Tandon's kiddy film dream comes true

Raveena Tandon.GIF

Posted: 12/06/2011 04:12 PM IST
Raveena tandons kiddy film dream comes true

Raveena Tandon's kiddy film dream comes true

రవీనా టాండన్ చిరకాల కోరిక తీరే సమయం దగ్గర పడింది. నిన్నమొన్నటి దాకా తన అందచందాలతో కుర్రకారును కట్టిపడేసిన ఈ బ్యూటీకి ఒక బాలల సినిమా తీయాలనేది ఆశ. ‘జిన్ లియా ఆస్మాన్’ అనే ద్విభాషా చిత్రంతో ఇది నెరవేరబోతోందని రవీనా చెబుతోంది. తల్లీశిశువు మధ్య భావోద్వేగాలకు సంబంధించిన అందమైన సినిమా ఇదని ట్విటర్‌లో రాసుకొచ్చింది.

ఇంతకుముందు బుడ్దా హోగా తెరా బాప్‌లో నటించిన ఈ 37 ఏళ్ల రూపసి.. ఇందులో ఆరేళ్ల బాలుడి తల్లిగా ప్రేక్షకులను అలరించనుంది. జిన్ లియా ఆస్మాన్ హిందీ, మరాఠీ భాషల్లో విడుదలవుతుంది. రవీనా 2003 నుంచి రెండేళ్లపాటు భారత బాలల చలనచిత్రాల సంఘం (సీఎఫ్‌ఎస్‌ఐ) చైర్‌పర్సన్‌గా పనిచేసింది.  అయితే 20 ఏళ్లుగా నటనారంగంలో ఉన్నప్పటికీ ఒక్క బాలల సినిమాలోనూ కనిపించలేదు. ‘సీఎఫ్‌ఎస్‌ఐలో పనిచేసినంత కాలం ‘బాలల సినిమా ఎప్పుడు తీస్తావ్’ అంటూ అందరూ అడిగేవారు.

అప్పటి నుంచే నాకు చిన్నపిల్లల సినిమా తీయాలని ఉండేది. మంచి స్క్రిప్టు, అవకాశం రాలేదు. జిన్ లియా ఆస్మాన్ కథను చదవగానే దానిపై ఎంతో అభిమానం ఏర్పడింది. కాబట్టి దీంతో చిరకాల వాంఛ తీరుతోంది’ అని రవీనా టాండన్ పేర్కొంది. అన్నట్టు రవీనాకు ఆరేళ్ల కూతురు రాషా, నాలుగేళ్ల కుమారుడు రణ్‌బీర్ ఉన్నాడు. 1991లో పత్తర్ కే ఫూల్‌తో ఈమె బాలీవుడ్‌లో అడుగుపెట్టింది.  తదనంతరం మెహ్రా, జిద్దీ, ఖిలాడీయోకా ఖిలాడీ బాక్సాఫీసు వద్ద భారీ విజయాలు నమోదు చేయడంతో ఆమె కెరీర్‌లో విజృంభించింది.

ఇవన్నీ కమర్షియల్ సినిమాలే. అయితే 2000 సంవత్సరం తరువాత సత్తా, ఆక్స్ వంటి సామాజిక ,ప్రయోగాత్మక సినిమాలకు పనిచేయడం ద్వారా విమర్శకుల ప్రశంసలను సంపాదించుకోగలిగింది. దామన్ సినిమాలో నటనకు గాను 2001లో జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకుంది. రవీనా కొన్ని తెలుగు చిత్రాల్లోనూ నటించింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Veena malik files for damages worth rs 10 crores
Shraddha das  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more