Venkatapuram Movie Review Report

Teluguwishesh వెంకటాపురం వెంకటాపురం Venkatapuram Movie Review.Lack of Gripping Screen Play but good Story Line. Product #: 82529 2.5 stars, based on 1 reviews
 • చిత్రం  :

  వెంకటాపురం

 • బ్యానర్  :

  గుడ్ సినిమా గ్రూప్, బహుమన్య ఆర్ట్

 • దర్శకుడు  :

  వేణు మదికంటి

 • నిర్మాత  :

  శ్రేయాస్ శ్రీనివాస్, తూము ఫణికుమార్

 • సంగీతం  :

  అచ్చు

 • సినిమా రేటింగ్  :

  2.52.5  2.5

 • ఛాయాగ్రహణం  :

  సాయి ప్రకాశ్

 • నటినటులు  :

  రాహుల్, మహిమ మఖ్వానా, అజయ్, అజయ్ ఘోష్, కాశీ విశ్వనాథ్ తదితరులు

Venkatapuram Movie Review

విడుదల తేది :

2017-05-12

Cinema Story

కథ :

 

పిజ్జా డెలివరీ బాయ్ గా పనిచేసే ఆనంద్(రాహుల్) ఒక సందర్భంలో తన అపార్ట్మెంట్ కు కొత్తగా వచ్చిన చైత్ర(మహిమా మక్వాన్)తో ప్రేమలో పడతాడు. అయితే అనుకోని మలుపుల మూలంగా వాళ్లిద్దరి జీవితాలు అప్పటికే అల్లకల్లోలంగా ఉంటాయి. కానీ, ఆనంద్ కు ఇంప్రెస్ అయ్యే టైంలోనే చైత్ర హత్యకు గురవుతుంది. దీంతో ఆ నేరం కాస్త ఆనంద్ మెడకు చుట్టుకుంటుంది. ఇక ఈ కేసును ఇద్దరు పోలీసాఫీసర్ లు రెండు కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు? ఇంతకీ చైత్రను హత్య చేసిందెవరు..? కొంపదీసి ఆనందే చంపాడా? చంపితే ఆ పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఇద్దరు ఆఫీసర్ లలో ఎవరు? ఎలా? ఛేధించారు అన్నదే కథ.

cinima-reviews
వెంకటాపురం

హ్యాపీడేస్ లో టైసన్ రోల్ లో మెప్పించిన రాహుల్ హరిదాస్ తర్వాత చేసిన సినిమాలు పెద్దగా ప్రయోజనాన్ని ఇవ్వలేకపోయాయి. కానీ, చాలా గ్యాప్ తీసుకుని వెంకటాపురం అనే ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సబ్జెక్ట్ తచ్చాడు. మహిమా మక్వాన్ జంటగా వేణు మడికంటి దర్శకత్వంలో తెరకెక్కిన వెంకటాపురం ఫస్ట్ లుక్, ట్రైలర్ తో అందరినీ ఎట్రాక్ట్ చేసింది. మరి అనుకున్న అంచనాలను సినిమా అందుకుందా చూద్దాం.

విశ్లేషణ:

టైటిల్స్ నుంచే సినిమాను ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ చేసిన దర్శకుడు వేణు ఓ పావుగంట తర్వాత ప్రేక్షకుడు లీనమైపోయేలా చేశాడు. అయితే వెంటనే వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో స్టోరీ మొత్తం మార్చేశాడు. భీమిలి అరాచకాలకు అడ్డాగా మారిందంటూ ఆసక్తి కలిగించి పేలవమైన లవ్ స్టోరీని డీల్ చేశాడు. ఇంట్రో లో ఉన్న ఇంట్రస్ట్ ను ఫస్ట్ హాఫ్ లో అలాగే మెయింటెన్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు.

ఓ యదార్ధ సంఘటన ఆధారంగా కథను రెడీ చేసుకున్న దర్శకుడు ఆ కథను గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఫుల్ ఫ్లెడ్జ్ గా ప్రజెంట్ చేయలేకపోయాడు. టేస్టీ బిర్యానీని ఒక్క లవంగం ముక్క నాశనం చేసినట్లు వెంకటాపురంలో అలాంటి లవంగాలు బోలెడు తగులుతుంటాయి. హీరో హత్య చేసే సన్నివేశం, హీరోయిన్ ప్రమాదంలో పడే సీన్లలో దర్శకుడి అనుభవలేమి కనబడుతుంది. అదే సమయంలో ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ లలో మాత్రం చాలా ఇంటలిజెన్స్ ను ప్రదర్శించాడు.

మంచి స్క్రీన్ ప్లే, ఇంట్రెస్టింగ్ట్ ట్విస్టులతో ఆకట్టుకున్నాడు. అయితే నటీనటుల నుంచి తగిన నటన రాబట్టుకోవడం, ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే పై పెద్దగా దృష్టి పెట్టకపోవడం, డబ్బింగ్ పై ఫోకస్ పెట్టకపోవడం కాస్త ఇబ్బంది కలిగిస్తాయి. అవే సినిమాపై మిశ్రమ అనుభూతి కలిగేలా చేస్తాయి కూడా.


నటీనటుల విషయానికొస్తే... హ్యాపీ డేస్ లో టైసన్ క్యారెక్టర్ తో యూత్ అందరికీ ఫెవరెట్ గా మారిన రాహుల్ ఈ సినిమాలో ఓ సాధారణ కుర్రాడిగా, పిజ్జా డెలివరీ బాయ్ గా ఆకట్టుకున్నాడు.. ముఖ్యంగా లేటైనా హీరోగా రాహుల్ ఒక మంచి ఎటెంప్ట్ చేశాడు. ఇప్పటి వరకూ చేయని క్యారెక్టర్ కావడంతో కొత్త కోణం చూపించాడు. అయితే నటన విషయంలో మాత్రం పెద్దగా స్కోప్ చూపించే అవకాశం మాత్రం రాలేదు. మహిమా మక్వానా లుక్కు పరంగా ఫర్వాలేదనిపించగా, యాక్టింగ్ తో ఓకే అనిపించుకుంది. టార్చర్ పోలీస్ గా అజయ్ ఘోష్, సిన్సియర్ ఆఫీసర్ గా అజయ్ ఆకట్టుకున్నారు. మిగతా రోల్స్ లో కాశీ విశ్వనాధ్, శశాంక్ న్యాయం చేశారు.


టెక్నీషియన్స్ పనితీరు... ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది సంగీత దర్శకుడు అచ్చు గురించే. గతంలో కొన్ని సినిమాల్లో సాంగ్స్ తో ఆకట్టుకున్న అచ్చు తన మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ తో హైలెట్ గా నిలిచాడు. సినిమాటోగ్రఫీ బాగుంది..మెయిన్ గా పాటల పిక్చరైజేషన్ లో తన పనితనం చూపించాడు సాయి ప్రకాష్. డైలాగ్స్ కొన్ని సందర్భాలలో మాత్రమే ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ పరవాలేదు. కొన్ని పాత్రలకు డబ్బింగ్ కుదరలేదు. సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ పరవాలేదు..

 

ఫ్లస్ పాయింట్లు:
ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్
బ్యాగ్రౌండ్ స్కోర్
సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్

 

మైనస్ పాయింట్లు:
ఫస్ట్ హాఫ్,
కొన్ని చోట్ల లాజిక్ లేని సీన్స్,
స్క్రీన్ ప్లే


తీర్పు:

ఓ చిన్న సినిమాగా వెంకటాపురం రూపొందినప్పటికీ ఫస్ట్ లుక్, ట్రైలర్ పరంగా మంచి బజ్ క్రియేట్ చేసింది. విడుదలకు ముందు ఉన్న హడావుడి సరైన ప్రమోషన్ లేకపోవడంతో రిలీజ్ టైమ్ లో కనిపించలేదు. దీనికి తోడు ఫస్టాఫ్ సరిగా లేకపోవడం అక్కడక్కడా సిల్లీ సీన్లుగా అనిపించినప్పటికీ.. మిస్టరీ డ్రామాలు, సస్పెన్స్ థ్రిల్లర్లు ఇష్టపడే ప్రేక్షకుల్ని వెంకటాపురం సో సో గా మెప్పిస్తుంది.

చివరగా.. వెంకటాపురం ఓ మాములు మర్డర్ థ్రిల్లర్

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.