నందిని నర్సింగ్ హోమ్ రివ్యూ | Nandini nursing home movie review

Teluguwishesh నందిని నర్సింగ్ హోమ్ నందిని నర్సింగ్ హోమ్ Nandini nursing home telugu movie review. Product #: 78439 2.75 stars, based on 1 reviews
  • చిత్రం  :

    నందిని నర్సింగ్ హోమ్

  • బ్యానర్  :

    ఎస్వీసీ క్రియేషన్స్

  • దర్శకుడు  :

    పీవీ గిరి

  • నిర్మాత  :

    రాధా కిషోర్, బిక్షమయ్య

  • సంగీతం  :

    అచ్చు

  • సినిమా రేటింగ్  :

    2.752.75  2.75

  • ఛాయాగ్రహణం  :

    దాశరథి శివేంద్ర

  • ఎడిటర్  :

    కార్తీక శ్రీనివాస్‌

  • నటినటులు  :

    నవీన్, శ్రావ్య, నిత్య, షకలక శంకర్‌, సప్తగిరి, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌ రెడ్డి తదితరులు

Nandini Nursing Home Movie Review

విడుదల తేది :

2016-10-21

Cinema Story

కథ:

ఉద్యోగం లేకపోయినా ఓ గర్ల్ ఫ్రెండ్ ను మెయింటెన్ చేస్తూ జీవితం సాఫీగా గడుపుతుంటాడు చంద్రశేఖర్ (నవీన్ విజయ్ కృష్ణ). అయితే డబ్బు పిచ్చి ఉన్న అమూల్య(శ్రావ్య) మాత్రం కట్నం ఎక్కువ ఇచ్చే సంబంధం రావటంతో చందూకి హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోతుంది. కొంతకాలం దిగులుపడి మెల్లిగా ఆ వ్యవహారం మరిచిపోతాడు. ఆ తర్వాత డబ్బు అవసరం రావటంతో ఎంకాం చదివినప్పటికీ, ఎంబీబీఎస్ అని అబద్ధం చెప్పి నందిని నర్సింగ్ హోంలో వైద్యుడిగా చేరతాడు. అక్కడ ఓ కాంపౌండర్, ఓ ఫెషెంట్, ఓ బిజినెస్ మెన్ సాయంతో మెల్లిగా ఎలాగోలా నెట్టుకొస్తాడు. 

అదే టైంలో హాస్పిటల్ యాజమాని(జయప్రకాశ్) కూతురు నందిని(నిత్య) చందూని ప్రేమిస్తుంటుంది. కానీ, కొంత కాలం తర్వాత చందు తప్పుతో ఓ ప్రాణం పోవటం, ఆస్పత్రిలో కొన్ని అనూహ్య పరిణామాలు జరిగి చందూ ఇబ్బందుల్లో పడిపోతాడు. మరి వాటన్నింటిని చేధించి ఎలా నిలబడతాడు అన్నదే కథ. 

cinima-reviews
నందిని నర్సింగ్ హోమ్

తెలుగులో ఒకప్పుడు కామెడీ చిత్రాలను పండించిన నటుడు నరేష్ ఇప్పుడు తండ్రి పాత్రలకు ప్రమోట్ అయ్యాడు. అందుకే తన తనయుడు నవీన్ హీరోగా ప్రమోట్ చేస్తూ నందిని నర్సింగ్ హోమ్ అనే చిత్రాన్ని ప్రేక్షకుల మీదకు వదిలాడు. మహేష్ బాబు కూడా మాంచి సపోర్ట్ ఇవ్వటం, ట్రైలర్ కూడా కామెడీ కామెడీగా ఉండటంతో చిత్రంపై మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి వాటిని నిలబెడుతూ డెబ్యూతోనే నవీన్ హిట్ అందుకున్నాడా చూద్దాం. 

విశ్లేషణ:
కొత్త కుర్రాడు. పెద్దగా పేరులేని డైరక్టర్. అలాంటప్పుడు మాస్ మసాలా కథతో వస్తాడని అంతా అనుకుంటారు. కానీ, ఇది ఒక సింపుల్ కథ. అలాగని ఇదేం గొప్పది కూడా కాదు. ఫస్టాఫ్ మొత్తం సింపుల్ గా నీట్ గా ఉండి, సెకండాఫ్ మొత్తం సస్పెన్స్ తో నడుస్తుంటుంది. కానీ, అందులో సరిగ్గా ఇమిడిపోయే కామెడీని ఇరికించాడు దర్శకుడు గిరి. కొత్త హీరోతో బిల్డప్ లు ఇవ్వకుండా, సరదాగా సాగిపోయే కథ ఇచ్చాడు. ఎటొచ్చి స్క్రీన్ ప్లేనే కాస్త డల్ గా అనిపించింది. ముగింపులో తనను మోసం చేసిన అమ్మాయి విషయంలో ఇచ్చిన ముగింపు బాగుంది.

నటీనటుల విషయానికొస్తే... నవీన్ కొత్త అయినప్పటికీ బాగా యాక్ట్ చేశాడు. లుక్స్ పరంగా అంత గొప్పగా ఏం లేకపోయినప్పటికీ ఎక్కడా అతి చేయకుండా సింపుల్ నటనతో ఆకట్టుకున్నాడు. కొన్ని చోట్ల ఆడియన్స్ అతనికి ఈజీగా కనెక్ట్ అయిపోతారు. తనకి సపోర్ట్ గా నటించిన కమెడియన్లతో ఈజీగా కనెక్ట్ అయిపోయి సమానంగా నటించాడు. వెన్నెల కిషోర్, సప్తగిరి, షకలక శంకర్ వీరే ఈ సినిమాకు బలం. ఈ నలుగురు లేకపోతే సినిమానే లేదు. హీరోయిన్లు తూతూ మంత్రంగా ఉన్నారేమో అనిపిస్తుంది. ఉన్నంతలో నిత్య కాస్త లుక్స్ తో ఆకట్టుకుంది. జయప్రకాశ్ రెడ్డి, జయప్రకాశ్ లు తమ పాత్రలకు మంచి న్యాయం చేశారు.

టెక్నిషియన్స్ విషయానికొస్తే... ఏ అంశాలు పెద్దగా ఆకట్టుకోలేదు. అచ్చు సంగీతం ఫర్వాలేదు. బ్యాగ్రౌండ్ కోసం వాడుకున్న థీమ్ బావుంది. ఛాయాగ్రహణం, ఎడిటింగ్, ఆఖరికి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చిన్న సినిమా కావటంతో ఆ రేంజ్ లోనే ఉన్నాయి.

ఫ్లస్ పాయింట్లు:
ఎంటర్ టైనింగ్ కథ,
నవీన్, కమెడియన్ల నటన,
క్లైమాక్స్ ట్విస్ట్


మైనస్ పాయింట్లు:
లాజిక్ లేని సీన్లు,

తీర్పు:
నట వారసుడు అనగానే హడావుడి చేయకుండా సింపుల్ గా ఓ సాధారణమైన సినిమాతో డెబ్యూ ప్రారంభించాడు నవీన్. దర్శకుడు కూడా పెద్దగా హడావుడి చేయకుండా మాములు కథనే ఎంటైర్ టైనింగ్ గా మలిచి అందించాడు. సేఫ్ జోనర్ తో బాగా డీల్ చేశాడు.

చివరగా... బోరింగ్ కొట్టదు. టైంపాస్ కోసం చూడొచ్చు.

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.