మజ్ను రివ్యూ | Majnu Movie Review

Teluguwishesh మజ్ను మజ్ను Nani's Majnu Movie Review. Product #: 77853 3.25 stars, based on 1 reviews
  • చిత్రం  :

    మజ్ను

  • బ్యానర్  :

    ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కేవా మూవీస్‌

  • దర్శకుడు  :

    విరించి వర్మ

  • నిర్మాత  :

    కిరణ్‌, జి.గీత

  • సంగీతం  :

    గోపీసుందర్

  • సినిమా రేటింగ్  :

    3.253.253.25  3.25

  • ఛాయాగ్రహణం  :

    జ్ఞానశేఖర్‌ వి.ఎస్

  • ఎడిటర్  :

    ప్రవీణ్‌ పూడి

  • నటినటులు  :

    నాని, ఇమ్మానుయేల్‌, ప్రియాశ్రీ, వెన్నెల కిషోర్‌, సత్యకృష్ణ, పోసాని, సప్తగిరి, సత్య, శివన్నారాయణ తదితరులు

Majnu Movie Review

విడుదల తేది :

2016-09-23

Cinema Story

భీమవరం కుర్రాడు ఆదిత్య(నాని) సినిమాల్లో దర్శకుడిగా రాణిద్దామని కలలు కనే ఓ కుర్రాడు. ఏకంగా రాజమౌళి దగ్గరే అసిస్టెంట్ గా జాయిన్ అయ్యి, బాహుబలి సినిమాకు పని చేస్తుంటాడు. ఇంతలో సుమ(ప్రియా శ్రీ) అనే ఐటీ యువతితో అతనికి పరిచయం ఏర్పడుతుంది. ఆదిత్యలోని చలాకీతనం, మంచితనం చూసి ఫ్లాటైపోయిన సుమ అతనికి ప్రపోజ్ చేస్తుంది. కానీ, తనకు ఓ సాడ్ ఫ్లాష్ బ్యాక్ ఉందని కిరణ్(అను ఇమాన్యుయేల్ ) తో జరిగిన ప్రేమకథ చెబుతాడు.చివర్లో ఆమెను తప్ప ఎవరినీ ఊహించుకోలేనని చెప్పి వెళ్లిపోతాడు. 

కానీ, ఆదిత్య సిన్సియారిటీ నచ్చిన సుమ అతన్ని వదలదు. ఇంతలో కిరణ్ మళ్లీ అతని జీవితంలోకి వస్తుంది. ఒకరు తనను ఇష్టపడేవారు, ఇంకోకరు తాను ఇష్టపడే వారు. మరి ఈ ఇద్దరి మధ్య మన మజ్ను ఎలా నలిగిపోతాడు? చివరికి ఎవరిని ఏలుకుంటాడు? మిగిలిన వారి పరిస్థితి ఏంటి? అన్నదే కథ.

cinima-reviews
మజ్ను

బ్యాక్ టూ బ్యాక్ నాలుగు హిట్లతోనే కాదు, ఈ యేడాదిలో అల్రెడీ రెండు సక్సెస్ లు రుచి చూసి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయాడు నేచురల్ స్టార్ నాని. ఇప్పుడు టాలీవుడ్ చూపంతా నానివైపే ఎందుకంటే మజ్నుతో మూడో రిలీజ్ చేసేశాడు. ఈరోజే సినిమా ప్రేక్షకుల ముందకు వచ్చేసింది. ఫస్ట్ సినిమా ఉయ్యాల జంపాలాతో సక్సెస్ అందుకున్న విరించి వర్మ దర్శకుడు. ప్రేమలో ఫెలయితే ఓడిపోకూడదన్న సందేశం ఇస్తున్న ఈ మజ్ను ఎంతమేర ఆకట్టుకున్నాడో రివ్యూలోకి వెళ్లి చూద్దాం.

విశ్లేషణ:
తెలుగులో ఎన్ని ప్రేమకథలు వచ్చినా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. కాకపోతే దానికి కాస్త ఎంటైర్ టైన్ మెంట్ టచ్ ఉంటే చాలూ. ఆటోమేటిక్ జనాలకు ఎక్కేస్తాయి. తొలి చిత్రం లో బావా మరదల్ల మధ్య లవ్ స్టోరీని డీల్ చేసిన విరించి ఇక్కడ మజ్ను అనే ట్రయాంగిల్ లవ్ స్టోరీని చూపించాడు. కథలో కొత్తదనం లేకపోయినా, డైలాగ్ లు, విజువల్స్, అన్నింటికి మించి పాటలు సినిమాకు ఆకర్షణగా నిలిచాయి. తనను వదిలి వెళ్లిపోయిన కిరణ్(అను ఇమన్యుయేల్), తిరిగి ఆదిత్య దగ్గరికి ఎందుకు వస్తుందో? ప్రేమించాలని ఎందుకు డిసైడ్ అవుతుందో బలమైన కారణం కనిపించదు. ఫస్టాఫ్ ఫుల్ కామెడీతో సాగిపోయే సినిమా, సెకండాఫ్ లో నిదానిస్తుంది. కానీ, క్లైమాక్స్ పది నిమిషాలు మళ్లీ సినిమాను నిలబెడుతుంది.

నటీనటుల విషయానికొస్తే... సినిమాకు బలం నానినే. మొత్తం తన భుజాలపై వేసుకుని నడిపించాడు. సినిమా మొత్తం నానినే కనిపిస్తాడు. సిన్సీయర్ లవర్ గా యాక్ట్ చేస్తూనే, తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. తన రెండు గత చిత్రాల్లో కామెడీపాలు కాస్త తగ్గినప్పటికీ, భలే భలే తరహాలో సినిమా మొత్తం నవ్వులు పంచాడు. మరోవైపు ఎమోషన్స్ సీన్లలో కూడా అంతే ఆకట్టుకున్నాడు. హీరోయిన్లలో అను ఇమాన్యుయోల్ కళ్లు, చీరకట్టుతో పద్దతిగా ఆకట్టుకోగా, ప్రియా శ్రీ స్కిన్ షోతో లిమిట్ లోనే అలరించింది. ఇక మిగతా వారిలో ఫస్టాఫ్ లో పోసాని, సెకండాప్ లో వెన్నెల కిషోర్ నవ్వులు పంచే బాధ్యతను తీసుకున్నారు. ముఖ్యంగా ఫస్ట్ , లాస్ట్ సీన్లలో రాజమౌళి కనిపించి ఊపుతెస్తాడు. ప్రభాస్ పెళ్లి, బాహుబలి-3 అంటూ సెటైర్ హిల్లేరియస్ గా ఉంది. మిగతా వారిలో సత్య, సప్తగిరి కామెడీతో ఆకట్టుకున్నారు. రాజ్ తరుణ్ క్లైమాక్స్ గెస్ట్ రోల్ ఆకట్టుకుంటుంది.

సాంకేతిక పరంగా... ఇప్పటిదాకా మెలోడియస్ ట్యూన్లు అందించిన గోపీసుందర్ మజ్నుతో మరోసారి ఇంప్రెస్ చేశాడు. అద్భుతమైన లోకేషన్లు, అందుకు తగ్గ పాటలు, ట్యూన్స్ ఎక్కడికో తీసుకెళ్తాయి. కానీ, బ్యాగ్రౌండ్ విషయంలో మాత్రం గోపీ తేలిపోయాడు. సినిమాకు మెయిన్ ఫిల్లర్ గా నిలిచింది జ్నానేశ్వర్ కెమెరా వర్క్. ముఖ్యంగా పల్లెటూరి లోకేషన్లు, రోమాంటిక్ సీన్లు, పాటలు ఇలా అన్నింటిలో తన పనితనం చూపించాడు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఫర్వాలేదనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగా కుదిరాయి.

ఫ్లస్ పాయింట్లు:
నాని నటన
హీరోయిన్ల అప్పీరియన్స్
ఎంటర్ టైనింగ్ ఫస్టాఫ్
క్లైమాక్స్
పాటలు
క్లీన్ కామెడీ
భీమవరం లవ్ స్టోరీ

మైనస్ పాయింట్లు
కాసేపు బోర్ కొట్టే సెకండాఫ్
రెగ్యులర్ కథ
ప్రీ క్లైమాక్స్

తీర్పు:
మజ్ను కథా, కథనం కొత్తదేమీ కాదు. కాకపోతే అందులో ఫీల్ మాత్రం ఉంది. సెకండాఫ్ లో హీరోయిన్ తిరిగొచ్చే కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టించినప్పటికీ రీఫ్రెషింగ్ సీన్లు, రెండున్నర గంట్లో రెండు గంటలు నవ్వులతో ఎంటర్ టైనింగ్ గా సాగిపోవటం, వెరసి మజ్ను థియేటర్లలో ప్రేక్షకులకు మంచి అనుభూతినే మిగులుస్తుంది.

చివరగా.... మజ్నుతో నాని హ్యాట్రిక్ కొట్టేశాడండీ...

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.