ఇంకొకడు రివ్యూ | Vikram inkokkadu review.

Teluguwishesh ఇంకొక్కడు ఇంకొక్కడు Vikram Inkokkadu Movie Review. Product #: 77589 2.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ఇంకొక్కడు

  • బ్యానర్  :

    థ‌మీన్స్ ఫిలింస్ బ్యాన‌ర్స్‌, తెలుగులో ఎన్ కేఆర్ ఫిల్మ్స్

  • దర్శకుడు  :

    ఆనంద్ శంకర్

  • నిర్మాత  :

    శిబు థ‌మీన్స్, తెలుగులో కృష్ణారెడ్డి

  • సంగీతం  :

    హ్యారిస్ జైరాజ్

  • సినిమా రేటింగ్  :

    2.52.5  2.5

  • ఛాయాగ్రహణం  :

    ఆర్.డి.రాజశేఖర్

  • ఎడిటర్  :

    భువన్ శ్రీనివాసన్

  • నటినటులు  :

    విక్రమ్, నయనతార, నిత్యామీనన్, నాసర్, తంబి రామయ్య, కరుణాకరన్ తదితరులు

Vikram Inkokkadu Review

విడుదల తేది :

2016-09-08

Cinema Story

మలేషియాలో భారతీయ ఎంబసీపై ఓ వృద్ధుడు అటాక్ చేసి అక్కడున్న సిబ్బంది మొత్తంను చంపటంతో సినిమా కథ మొదలౌతుంది. దీని వెనకాల లవ్(విక్రమ్) అనే గే క్రూయల్ సైంటిస్ట్ ప్రయోగం ఉందని తెలుసుకున్న ఇండియన్ ఆఫీసర్ మాలిక్(నాజర్) అతన్ని మట్టుపెట్టేందుకు ఓ స్పెషల్ ఆపరేషన్ చేయించాలనుకుంటాడు. అందుకోసం గతంలో లవ్ చేతిలో దెబ్బతిన్న అఖిలన్(విక్రమ్) తోపాటు, ఆరుషి(నిత్యామీనన్) లను స్పెషల్ ఆపీసర్లను అక్కడికి పంపిస్తాడు. 

 

అక్కడ వారిద్దరికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? దాని చేధించి అఖిల్ లవ్ ను ఎలా మట్టుపెట్టాడు? అసలు లవ్-అఖిలన్ మధ్య గతంలో ఉన్న శత్రుత్వం ఏంటీ? మీరా(నయనతార) కి వీరికి కనెక్షన్ ఏంటీ? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 

cinima-reviews
ఇంకొక్కడు

కమర్షియల్ గా సక్సెస్ అనే పదానికి దూరమై చాలా కాలం అయినప్పటికీ, ఏ మాత్రం వెనకాడకుండా ప్రయోగాలు చేస్తూనే పోతున్నాడు నటుడు విక్రమ్. అన్నియన్ తెలుగులో అపరిచితుడు తర్వాత అక్కడ, ఇక్కడ విక్రమ్ హిట్ లేదనే చెప్పాలి. అయనా ఇంకొక్కడు అంటూ మరోసారి డిఫరెంట్ సబ్జెక్టుతో మరోసారి మన ముందుకు వచ్చాడు. ఈ రోజే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి దాని ఫలితం ఎలా ఉంది, ఊరిస్తున్న సక్సెస్ అతని ఖాతాలో పడిందా? తెలసుకోవాలంటే ఛలో రివ్యూ...

 

విశ్లేషణ:
రెండో ప్రపంచ యుద్ధంలోని ఓ టాపిక్ ను పట్టుకుని కథను రూపొందించాడు డైరక్టర్ ఆనంద్ శంకర్. అయితే ఫస్టాఫ్ ను గ్రిప్పింగ్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో నడిపించిన దర్శకుడు, రెండో పార్ట్ విషయం వచ్చే సరికి పూర్తిగా తడబడ్డాడు. కేవలం చేజింగ్ లు, యాక్షన్ ఎపిసోడ్ లతో నింపేయటంతో సినిమా బోర్ మూడ్ లోకి తీసుకెళ్తుంది. కథనం విషయంలో ఎక్కడా కన్ఫ్యూజ్ లేకుండా వెళ్లినప్పటికీ, నేరేషన్ స్లోగా ఉండటం, ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ లేకపోవటం సినిమాకు డ్రాప్ బ్యాక్ ఎలిమెంట్స్ గా నిలిచాయి. కొన్ని సన్నివేశాలు అయితే లాజిక్ లేకుండా మరీ సిల్లీగా అనిపిస్తాయి.

ఇక ఫెర్ ఫార్మెన్స్ విషయానికొస్తే... కొత్త తరహా కాన్సెప్ట్ లను ఎంచుకోవటం, వాటిలో అద్భుతంగా జీవించేయటంలో విక్రమ్ ను మించిన వారు లేరని మరోసారి ఇంకొక్కడు నిరూపిస్తుంది. తనకిచ్చిన పాత్రకు వంద శాతం న్యాయం చేసే విక్రమ్ ఇందులోనూ అదే పని చేశాడు. ఓవైపు సిన్సియర్ ఆఫీసర్ పాత్రలో ఒదిగిపోతూనే, కంప్లీట్ నెగటివ్ షేడ్స్ ఉన్న మరోపాత్రలో జీవించేశాడు. ముఖ్యంగా హిజ్రా విలన్ లవ్ పాత్ర గుర్తుండిపోతుంది. నయనతార గ్లామర్ షోకి పరిమితం కాగా, నిత్యామీనన్ సీరియస్ పాత్రలో కాసేపు ఆకట్టుకుంటుంది. నాజర్ పాత్ర పరిధిలో నటించగా, తంబి రామయ్య కామెడీ చికాకు పెట్టిస్తుంది. వెరసి మంచి కాస్టింగ్ ను ఎంచుకున్నప్పటికీ దర్శకుడు సరిగ్గా ఉపయోగించుకోలేదేమో అనిపించకమానదు.

టెక్నికల్ అంశాలలో హ్యారిస్ జైరాజ్ మ్యూజిక్ మరీ దారుణంగా ఉంది. కాకపోతే బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం కాస్త అలరించింది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, ప్రోడక్షన్ వాల్యూస్ అన్ని బాగా కుదిరాయి.


ఫ్లస్ పాయింట్లు:
విక్రమ్ నటన(ముఖ్యంగా లవ్ పాత్ర)
బ్యాగ్రౌండ్ స్కోర్
సినిమాటోగ్రఫీ
ట్విస్ట్ లు, యాక్షన్ ఎపిసోడ్స్

 

మైనస్ పాయింట్లు:
ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ లేకపోవటం
స్లో నారేషన్
పాటలు

 

తీర్పు:

స్పై థ్రిల్లర్స్ ను ఎంజాయ్ చేయాలనుకునే వర్గ ప్రేక్షకుల తప్ప బీ, సీ సెంటర్ ఆడియన్స్ కి ఈ సినిమా పెద్దగా ఎక్కదు. నటనలో విక్రమ్ స్థాయిని ఓ మెట్టు పైకి ఎక్కించినప్పటికీ, కమర్షియల్ మాత్రం విక్రమ్ కి కావాల్సిన హిట్ దాహం ఈ చిత్రం తీరుస్తుందనటం సందేహమే.

చివరగా... ఇంకొక్కడు ట్విస్ట్ లతో కూడిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సగటు ప్రేక్షకుడికి ఎక్కటం కూసింత కష్టమే.

 

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.