The Full Telugu Review Of Upendra 2 Movie | Kritis Akheeva | Parul Yadav | Kannada | Telugu Movies

Teluguwishesh ఉపేంద్ర 2 ఉపేంద్ర 2 upendra 2 telugu movie review kristina akheeva parul yadav : The Full Telugu Review Of Upendra 2 Movie Which Is Sequel To Upendra. In This Movie Kristina Akheeva And Parul Yadav Romances With Actor Upendra. Product #: 67176 2 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ఉపేంద్ర 2

  • బ్యానర్  :

    లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్

  • దర్శకుడు  :

    ఉపేంద్ర

  • నిర్మాత  :

    నల్లమలుపు బుజ్జీ

  • సంగీతం  :

    గురుకిరణ్

  • సినిమా రేటింగ్  :

    22  2

  • ఛాయాగ్రహణం  :

    అశోక్ కశ్యప్

  • ఎడిటర్  :

    శ్రీ(క్రేజీ మైండ్స్)

  • నటినటులు  :

    ఉపేంద్ర, క్రిస్టినా అకిహివా, పారుల్ యాదవ్ తదితరులు

Upendra 2 Telugu Movie Review Kristina Akheeva Parul Yadav

విడుదల తేది :

2015-08-14

Cinema Story

కాలేజ్ స్టూడెంట్ ఖుషీ (క్రిస్టినా అకిహివా). గతం, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా కేవలం వర్తమానం గురించి ఆలోచించే మనిషే సరిగ్గా పనిచేసుకుంటూ వెళతాడని ఖుషీకి తన ప్రొఫెసర్ చెబుతాడు. ఈ మాటలకు ఖుషీ చాలా ఆసక్తి చూపుతుంది. అలాంటి వ్యక్తిత్వమున్న వ్యక్తిని వెతుక్కుంటూ వెళుతుంది ఖుషీ. చివరకు ఓ గ్రామంలో అలాంటి వ్యక్తిత్వం వున్న నువ్వు(ఉపేంద్ర) ఖుషీ కనిపిస్తాడు. నువ్వు ప్రవర్తన నచ్చి ఖుషీ అతడిని ప్రేమిస్తుంది. అయితే అదే సమయంలో శైలజ(పారుల్ యాదవ్)వలన నువ్వు గురించి ఓ నిజం తెలుస్తుంది. ఇంతకీ ఆ నిజం ఏమిటి? అసలు నువ్వు ఎవరు? శైలజ ఎవరు? నువ్వు ఎందుకు అలా అయ్యాడు? చివరకు ఏమయ్యింది? అనే అంశాలను తెలుసుకోవాలంటే ‘ఉపేంద్ర2’ చిత్రం చూడాల్సిందే.

cinima-reviews
ఉపేంద్ర 2

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర గతంలో ‘రా’, ‘ఉపేంద్ర’, ‘కన్యాదానం’ వంటి పలు చిత్రాలతో తెలుగులో భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. అలాగే ఇటీవలే ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంలో కూడా మంచి పాత్రలో నటించి, మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇప్పుడు తన ఇమేజ్ ని మరింత విస్తృతం చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ హీరో గతంలో నటించిన ‘ఉపేంద్ర’ చిత్రానికి సీక్వెల్ గా ‘ఉపేంద్ర2’ చిత్రాన్ని తెరకెక్కించాడు. కన్నడంలో ‘ఉప్పి2’ పేరుతో విడుదల చేస్తున్నారు. ‘ఉపేంద్ర2’ చిత్రాన్ని లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత నల్లమలుపు బుజ్జీ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగష్టు 14న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం భాషలలో విడుదల చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

Cinema Review

ప్లస్ పాయింట్స్:
ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ ఉపేంద్ర. ఉపేంద్ర తన నటనతో అదరగొట్టాడు. నువ్వు అనే పాత్రకు ఉపేంద్ర వంద శాతం న్యాయం చేసాడు. ముఖ్యంగా కొన్ని కొన్ని సన్నివేశాలలో ఉపేంద్ర జీవించేసాడు. అంతేకాకుండా పలు విభిన్న గెటప్ లతో ఉపేంద్ర ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఉపేంద్ర చెప్పిన డైలాగ్స్ బాగున్నాయి. ఇక హీరోయిన్లు క్రిస్టినా అకిహివా, పారుల్ యాదవ్ లు వారి వారి పాత్రల మేరకు నటించారు. ఇద్దరు గ్లామర్ పరంగా చాలా బాగున్నారు. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేరకు పర్వాలేదనిపించారు.

మైనస్ పాయింట్స్:
గతంలో వచ్చిన ‘ఉపేంద్ర’ చిత్రానికి సీక్వెల్ గా ఇపుడు ‘ఉపేంద్ర2’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో నువ్వు పాత్రకు ఎలాంటి కన్ క్లూజన్ ఇవ్వకుండానే వదిలేసారు. ముఖ్యంగా పాత్ర తీరుతెన్నులు విభిన్నంగా వున్నప్పటికీ చాలా సన్నివేశాలలో సరైన ఎండింగ్ లేదనిపించింది. అసలు ‘ఉపేంద్ర2’ ను ఎందుకు తీసాడో సినిమా చివర్లో ఎలాంటి కన్ క్లూజన్ ఇవ్వలేదు. మొత్తానికి పర్వాలేదనిపించింది అంతే.

సాంకేతికవర్గం పనితీరు:
దర్శకుడిగా ఉపేంద్ర తనదైన శైలిలో బాగా ఆకట్టుకున్నాడు. విభిన్న తరహా చిత్రాలను కోరుకునే ప్రేక్షకులకు ఈ చిత్రం బాగా నచ్చుతుంది. గురుకిరణ్ సంగీతం పర్వాలేదు. అశోక్ కశ్యప్ సినిమాటోగ్రఫి బాగుంది. కొన్ని కొన్ని విజువల్స్ చాలా బాగున్నాయి. ఎడిటింగ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా:
‘ఉపేంద్ర2’: అప్పుడు నేను.. ఇప్పుడు నువ్వు