Dagudumootha Dandakor Movie Review | Rajendra Prasad | Director Krish

Teluguwishesh దాగుడుమూత దండాకోర్ దాగుడుమూత దండాకోర్ Dagudumootha Dandakor Movie Review : Natakireeti Rajendra Prasad Latest Movie Dagudumootha Dandakor Review Which is Directed By Krish. Product #: 63930 3.25 stars, based on 1 reviews
  • చిత్రం  :

    దాగుడుమూత దండాకోర్

  • బ్యానర్  :

    ఉషాకిరణ్ ఫిలిమ్స్

  • దర్శకుడు  :

    ఆర్.కె.మలినేని

  • నిర్మాత  :

    రామోజీరావు

  • సంగీతం  :

    ఇ.యస్.మూర్తి

  • సినిమా రేటింగ్  :

    3.253.253.25  3.25

  • ఛాయాగ్రహణం  :

    జ్ఞానశేఖర్.వి.యస్

  • ఎడిటర్  :

    ధర్మేంద్ర కాకరాల

  • నటినటులు  :

    రాజేంద్రప్రసాద్, సారా అర్జున్ తదితరులు

Dagudumootha Dandakor Movie Review

విడుదల తేది :

2015-05-09

Cinema Story

ఓ అందమైన పల్లెటూరిలో... ఊరందరికీ పెద్దగా వ్యవహరించే రాజు(రాజేంద్రప్రసాద్) గారంటే అందరికి గౌరవం. రాజుకు తన మనవరాలు బంగారం(సారా అర్జున్) అంటే చాలా ఇష్టం. బంగారంకు తన చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమతో పెంచుకుంటున్న నాని(బంగారం) అంటే ఇంకెంతో ఇష్టం. అయితే రాజుగారి ముగ్గురు పిల్లలు వృత్తిరిత్యా ఎక్కడెక్కడో నివసిస్తూ వుంటారు. ఊర్లో జరుగనున్న పోలేరమ్మ జాతరకు వారందరూ రాజు గారి కోరిక మేరకు కుటుంబ సమేతంగా ఆ పల్లెటూరికి వస్తారు.

ఆ ఊరికి వచ్చాక వారికి కొన్ని ప్రమాద సంఘటనలు జరుగుతాయి. దీనికి గల కారణం గతంలో ఎప్పుడో పోలేరమ్మకు మొక్కుకున్న మొక్కు తీర్చలేదని తెలుస్తుంది. పోలేరమ్మకి నానిని బలిచ్చి మొక్కు తీర్చుకోవాలనుకుంటారు. అలా అనుకున్న తర్వాత నాని తర్వాతి రోజు నుంచి కనిపించకుండా పోతుంది. ఇక అక్కడి నుంచి నాని కోసం అందరూ వెతకడం మొదలవుతుంది. ఇంతకీ నాని ఏమయ్యింది? చివరకు నాని దొరికిందా లేదా? నానిని పోలేరమ్మకు బలిచ్చారా లేదా? చివరకు ఏం జరిగింది? అనే ఆసక్తి అంశాలను మీరు వెండితెర మీద చూడాల్సిందే.

cinima-reviews
దాగుడుమూత దండాకోర్

రాజేంద్రప్రసాద్, సారా అర్జున్ ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం ‘దాగుడుమూత దండాకోర్’. క్రిష్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ ఫిలిమ్స్ బ్యానర్ పై రామోజీరావు నిర్మించిన ఈ చిత్రానికి ఆర్.కె.మలినేని దర్శకత్వం వహించారు. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘సైవం’ చిత్రానికి రీమేక్ ఇది. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!

రాజేంద్రప్రసాద్, సారా అర్జున్ ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం ‘దాగుడుమూత దండాకోర్’. క్రిష్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ ఫిలిమ్స్ బ్యానర్ పై రామోజీరావు నిర్మించిన ఈ చిత్రానికి ఆర్.కె.మలినేని దర్శకత్వం వహించారు. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘సైవం’ చిత్రానికి రీమేక్ ఇది. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా! - See more at: http://www.cinewishesh.com/movie-film-reviews/200-movie-film-reviews/54477-dagudumootha-dandakor-movie-review.html#sthash.baA9uCbC.dpuf

Cinema Review

ప్లస్ పాయింట్స్:

హాట్ హాట్ వేడి పుట్టిస్తున్న ఈ సమ్మర్లో ‘దాగుడుమూత దండాకోర్’ చిత్రం చల్లని ఓ పల్లెటూరి వాతావరణంలోకి తీసుకెళ్లింది. కుటుంబంలో వుండే అనుబంధాలు, అప్యాయతాలను చాలా చక్కగా చూపించారు. ఇక నటీనటుల విషయానికొస్తే...

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ సారా అర్జున్. రాజు గారి మనవరాలిగా బంగారం పాత్రలో సారా అద్భుతంగా నటించింది. బంగారం పాత్రకు సారా తప్ప మరేవరూ సరిపోరు అని అనిపించేలా చక్కటి నటన కనబరిచింది. తక్కువ డైలాగ్స్ వున్నప్పటికీ... తన హావాభావాలు, కళ్లతో అద్భుతంగా నటించింది. ఇక రాజుగారి పాత్రలో నటించిన రాజేంద్రప్రసాద్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇందులో ఆయన కొత్త డిఫరెంట్ లుక్ తో బాగా ఆకట్టుకున్నాడు. యూత్ లవర్స్ గా నటించిన సిద్ధార్థ్ వర్మ, నిత్యాశెట్టిలు చాలా చక్కగా నటించారు. వీరిద్దరి కెమిస్ట్రీ బాగుంది. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రలకు పూర్తి న్యాయం చేసారు.

ఇక సినిమాకు మరో ప్లస్ పాయింట్స్ కామెడీ, నిడివి. ఫస్ట్ హాఫ్ లో కామెడీ బాగుంది. సత్యం రాజేష్, శ్రీను, సన్యాసి రాజు అలాగే రాజుగారి పనివాడు... ఇలా వీరిందరూ తెగ నవ్వించేస్తారు. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీకి కొదవలేదని చెప్పుకోవాలి. ఇక రన్ టైం కూడా రెండు గంటలే కావడంతో సినిమాకు బాగా ప్లస్ అవుతుంది.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో పెద్దగా మైనస్ పాయింట్స్ ఏం లేవు కానీ... సెకండ్ హాఫ్ మరీ దారుణంగా సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఎమోషనల్ సన్నీవేశాలు బాగున్నప్పటికీ.,. ఆ ఫీలింగ్ ప్రేక్షకులకు కనెక్ట్ అవలేకపోయింది. అలాగే సెకండ్ హాఫ్ లో అవసరంలేని కొన్ని సీన్లు చాలా బోర్ కలిగిస్తాయి. క్లైమాక్స్ ను మరీ బాగా సాగదీసేసారు. ఇక ఇందులో కమర్షియల్ సినిమాకు వుండాల్సిన యాక్షన్, డాన్సులు, పైట్లు లాంటివి ఏం లేవు కాబట్టి.. మాస్ ప్రేక్షకులకు కాస్త బోర్ అనిపించవచ్చు.

సాంకేతికవర్గ పనితీరు:

ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతికవర్గంలో సినిమాటోగ్రఫి నుంచి చెప్పుకుందాం. సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ ప్రతి ఫ్రేంను అద్భుతంగా చూపించాడు. పల్లెటూరి అందాలను, అక్కడి ప్రకృతిని చాలా చక్కగా చిత్రీకరించాడు. డైలాగ్స్ బాగున్నాయి. ఈఎస్ మూర్తి అందించిన సంగీతం సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. అనవసరంగా కాకుండా అన్నీ పాటలు కూడా సంధర్భానుసారంగానే రావడంతో సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది.

ఎఎల్ విజయ్ అనుకున్న స్టోరీ లైన్ చాలా బాగుంది. కానీ కథనం విషయంలో సెకండ్ హాఫ్ లో మరింత ఆసక్తిగా మార్చేస్తే బాగుండేది. ఆర్.కె.మలినేని దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. కానీ సెకండ్ హాఫ్ ను మరింత జాగ్రత్తగా, ఆసక్తిగా తీసుంటే ఇంకా బాగుండేది. నటీనటుల నుంచి మంచి పర్ఫార్మెన్స్ రాబట్టుకున్నాడు. ఎడిటర్ ధర్మేంద్ర ఫస్ట్ హాఫ్ ను బాగా ఎడిటింగ్ చేసారు. సెకండ్ హాఫ్ పై కేర్ తీసుకోవడం మర్చిపోయారు. సెకండ్ హాఫ్ ను మరింత జాగ్రత్తగా ఎడిటింగ్ చేసుంటే ఇంకా బాగుండేది.

ఇక చివరగా నిర్మాతలు. తమిళంలో విజయం సాధించిన ‘సైవం’ అనే చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయాలనే ఆలోచన వచ్చి, నిర్మించడానికి ముందుకొచ్చిన రామోజీరావు, క్రిష్ లు.. ఈ సినిమాను చాలా గ్రాండ్ గా నిర్మించారు. నిర్మాణ విలువలు చాలా గ్రాండ్ గా వున్నాయి. ఎక్కడా రాజీపడకుండా చాలా చక్కగా నిర్మించారు.

చివరగా:
దాగుడుమూత దండాకోర్: వేసవిలో చల్లదనాన్ని అందించే ఫ్యామిలీ కథాచిత్రం!