Teluguwishesh సూర్య vs సూర్య సూర్య vs సూర్య Get information about Surya vs Surya Telugu Movie Review, Surya vs Surya Movie Review, Karthik Ghattamaneni Surya vs Surya Movie Review, Surya vs Surya Movie Review And Rating, Surya vs Surya Telugu Movie Talk, Surya vs Surya Telugu Movie Teaser, Surya vs Surya Telugu Movie Trailer, Surya vs Surya Telugu Movie Gallery and more only on TeluguWishesh.com Product #: 61495 2 stars, based on 1 reviews
  • చిత్రం  :

    సూర్య vs సూర్య

  • బ్యానర్  :

    సురక్ష్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్

  • దర్శకుడు  :

    కార్తీక్ ఘట్టమనేని

  • నిర్మాత  :

    మల్కాపురం శివకుమార్

  • సంగీతం  :

    సత్య

  • సినిమా రేటింగ్  :

    22  2

  • ఎడిటర్  :

    గౌతం

  • నటినటులు  :

    నిఖిల్, త్రిథ, తనికెళ్ల భరణి, సత్య తదితరులు

Surya Vs Surya Movie Review Telugu

విడుదల తేది :

2015-03-05

Cinema Story

మధుబాల కొడుకైన సూర్య(నిఖిల్)కు పుట్టినప్పటి నుంచి ‘ఫోర్బిరియా’ అనే జబ్బు వుంటుంది. ఈ జబ్బు ఏంటంటే... రక్తంలో వుండే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువ కావడం వల్ల సూర్య కిరణాలు తాకితే 15 నిమిషాల్లో ఆ మనిషి చనిపోతాడు. అలాంటి వ్యాధితోనే సూర్య బాధపడుతుంటాడు. అందుకే ఇతనిని మధుబాల పగలంతా ఇంట్లోనే వుంచి, సాయంత్రం వేళల్లో బయటకు పంపిస్తుంటుంది. ఆ విధంగా సూర్య నైట్ కాలేజ్ లో చేరతాడు. కాలేజ్ లో సూర్యకు అరుణ స్వామి(సత్య), వెర్రిస్వామి(తనికెళ్లభరణి)లు ఫ్రెండ్స్ అవుతారు.

అనుకోకుండా సూర్య ఓ రోజు సంజన(త్రిథా)ను చూసి ప్రేమలో పడతాడు. ఆ తర్వాత సంజనతో స్నేహం చేసి, ఆ స్నేహాన్ని ప్రేమగా మార్చేసుకుంటాడు. ఇక తనకున్న సమస్య గురించి సంజనకు చెప్పాలనుకుంటాడు.. కానీ సూర్య కంటే ముందుగా ఇతరుల ద్వారా సంజనకు తెలుస్తుంది. దాంతో సంజన సూర్యకు దూరమవుతుంది. సంజన ప్రేమను కోల్పోయిన సూర్య తన ప్రేమను తిరిగి దక్కించుకోవడానికి సూర్య ఏం చేసాడు? చివరకు ఏం జరిగింది అనే అంశాలను తెలుసుకోవాలంటే.. ఈ మూవీని వెండితెర మీద చూడాల్సిందే!

cinima-reviews
సూర్య vs సూర్య

‘స్వామిరారా’, ‘కార్తికేయ’ వంటి హిట్ సినిమాల తర్వాత నిఖిల్ మరో సైంటిఫిక్ సస్పెన్స్ స్టోరీతో ‘సూర్య vs సూర్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇటీవలే ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని, క్లీన్ U సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మల్కాపురం శివకుమార్ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. నిఖిల్ సరసన త్రిథ హీరోయిన్ గా నటించింది. ‘ఫోర్బిరియా’ అనే వ్యాధితో బాధపడే ఓ యువకుడు తన జీవిత లక్ష్యాన్ని ఎలా సాధించాడు అనే కథాంశంతో రూపొందిన ఈ చిత్రం నిఖిల్ హ్యట్రిక్ విజయాన్ని అందిస్తుందో లేదో ఒకసారి చూద్దామా!

Cinema Review

నిఖిల్ ఈ సినిమాలో ఓ విభిన్న పాత్రలో నటించాడు. ఫోర్ఫిరియా జబ్బున్న కుర్రాడిగా, అలాగే ఓ ప్రేమికుడిగా నిఖిల్ మంచి నటనను కనబరిచాడు. సంజన పాత్రలో హీరోయిన్ త్రిథ చాలా చక్కగా నటించింది. మొదటి సినిమా అయినప్పటికీ.. హవాభావాలు, గ్లామర్ పరంగా త్రిధ బాగా నటించింది. ఇక సత్య, తనికెళ్ల భరణిలు సూర్యతోపాటు ట్రావెల్ అవుతూ మంచి ఎంటర్ టైన్మెంట్ అందించారు. నిఖిల్ తల్లి పాత్రలో మధుబాల పూర్తి న్యాయం చేసింది. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేరకు నటించారు.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్.. ‘ఫోర్బిరియా’ అనే జబ్బుతో బాధపడే ఓ వ్యక్తి జీవితం ఎలా నడుస్తుందనే కాన్సెప్ట్ అని చెప్పుకోవాలి. నిఖిల్ ఈ సినిమాను తన భుజాలపై వేసుకొని నడిపించాడని చెప్పుకోవచ్చు. సూర్య కిరణాలు పడితే చచ్చిపోతాననే భయంతో పాటుగా ఓ అమ్మాయిని ప్రేమించే ప్రేమికుడిగా నిఖిల్ నటన అద్భుతం. ఇక త్రిథా కూడా చాలా బాగా నటించింది. కేవలం గ్లామర్ పరంగా మాత్రంగానే కాకుండా బ్యూటిఫుల్ హవాభాలతో అందరిని ఆకట్టుకుంది.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాకు పెద్ద మైనస్ పాయింట్ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ లో ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా చూస్తుంటారో... సెకండ్ హాఫ్ లో ‘బాబోయ్’ అనే రేంజులో అనిపిస్తూ వుంటుంది. ఫస్ట్ హాఫ్ కు పూర్తి వ్యతిరేకంగా, సెకండ్ హాఫ్ ను మరీ దారుణంగా సాగదీసారు.

సాంకేతిక వర్గ పనితీరు:

సినిమాటోగ్రాఫర్ గా పలు చిత్రాలకు సినిమాటోగ్రఫిని అందించిన కార్తీక్... ఈ సినిమాతో దర్శకుడిగా అవతారమెత్తాడు. స్వతహాగా సినిమాటోగ్రాఫర్ కావడం వల్ల... ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. అలాగే కథ, స్ర్కీన్ ప్లే డిపార్ట్ మెంట్లను కూడా కార్తీక్ డీల్ చేసాడు. కథ పరంగా మంచి కాన్సెప్టును తీసుకున్నప్పటికీ... స్ర్కీన్ ప్లే పరంగా సెకండ్ హాఫ్ లో మరింత శ్రద్ధ తీసుకొని వుంటే బాగుండేది. దర్శకుడిగా మాత్రం కార్తీక్ మంచి మార్కులే దక్కించుకున్నాడు.

ఇక చందు మొండేటి రాసిన డైలాగ్స్ బాగున్నాయి. సత్య మహవీర్ అందించిన సంగీతం పర్వాలేదు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ పాయింట్. ఇక నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

చివరగా:
సూర్య వర్సెస్ ప్రేక్షకులు